Amazon Festival Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021 అక్టోబర్ 4నుంచే

అక్టోబర్ 4నుంచి ఫెస్టివ్ సీజన్ మొదలవనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అమెరికా ఈ కామర్స్ దిగ్గజం శుక్రవారం జరిపిన వర్చువల్ ప్రెస్ కాన్ఫిరెన్స్ లో ఈ ప్రోగ్రాంను ప్రకటించారు.

Amazon Festival Sale: అమెజాన్ అద్భుతమైన అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. అక్టోబర్ 4నుంచి ఫెస్టివ్ సీజన్ మొదలవనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అమెరికా ఈ కామర్స్ దిగ్గజం శుక్రవారం జరిపిన వర్చువల్ ప్రెస్ కాన్ఫిరెన్స్ లో ఈ ప్రోగ్రాంను ప్రకటించారు. దేశవ్యాప్తంగా నెలరోజుల పాటు పలు పండగలు ఉన్న నేపథ్యంలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021ను ప్రారంభించనున్నారు.

అక్టోబర్ 7న మహరాజా అగ్రసేన్ జయంతి, అక్టోబర్ 13న దుర్గాష్టమి, 14మహానవమి, 15దసరా, 19న మిలాద్ ఉన్ నబీ, 20న మీరాబాయి జయంతి, 24న కర్వా చౌత్ లాంటి పండుగలతో అక్టోబర్ నెల మొత్తం ఇదే సంబరం కనిపించనుంది.

గత వారం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2021 పురస్కరించుకుని అక్టోబర్ 7 నుంచి స్పెషల్ సేల్స్ ఉంటాయని చెప్పింది. ఇప్పుడు అమెజాన్ కూడా. ప్రత్యేకమైన వెబ్ పేజ్ తో రెడీ అయిన అమెజాన్ మొబైల్ ఫోన్ మోడల్స్, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ డివైజ్ లు స్మార్ట్ వాచ్ లు, ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ టీవీలు లాంటివి తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.

ఈ డీల్స్, డిస్కౌంట్స్, ఆఫర్స్‌తో పాటుగా కొత్తగా 1000ప్రొడక్ట్స్ ను లాంచ్ చేయాలనుకుంటుంది. యాపిల్, ఆసుస్, ఫాజిల్, హెచ్‌పీ, లెనోవో, వన్ ప్లస్, శాంసంగ్, సోనీ, షియోమీ బ్రాండ్లకు చెందిన మొబైల్స్ ను లాంచ్ చేస్తుంది.

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అమెజాన్ పే కస్టమర్లు యుటిలిటీ బిల్స్, టికెట్ బుకింగ్స్, మనీ పంపుకోవడం ద్వారా దాదాపు రూ.5వేలు సేవ్ చేసుకోవచ్చు. అదనంగా అమెజాన్‌తో పార్టనర్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై 10శాతం డిస్కౌంట్ ను అందిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు