Anupama Parameswaran : బేబీ బంప్‌తో అనుపమ.. షాక్‌లో ఫ్యాన్స్

తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన ఇంస్టాగ్రామ్ లో బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలని షేర్ చేసింది. ఇందులో తన తండ్రి కూడా ఉండటం, ఆ ఫోటోలు చాలా సహజంగా ఉండటంతో చాలా మంది అనుపమ నిజంగానే ప్రెగ్నెంట్...

Anupama Parameswaran :   ‘ప్రేమమ్‌’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ అడపాదడపా సినిమాలు చేస్తూనే అభిమానులని మాత్రం బాగా సంపాదించుకుంది. తన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ కొత్త కొత్త ఫొటోలతో పాటు తనకి సంబంధించిన విశేషాలని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇటీవలే ‘రౌడీ బాయ్స్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులని అలరించింది. ఇందులో లిప్ లాక్ సీన్స్, రొమాన్స్ సీన్స్ తో ఘాటుగా రెచ్చిపోయింది. తాజాగా అనుపమ బేబీ బంప్‌తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు.

తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన ఇంస్టాగ్రామ్ లో బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలని షేర్ చేసింది. ఇందులో తన తండ్రి కూడా ఉండటం, ఆ ఫోటోలు చాలా సహజంగా ఉండటంతో చాలా మంది అనుపమ నిజంగానే ప్రెగ్నెంట్ ఏమో అని భ్రమ పడ్డారు. అయితే ఫొటోస్ తో పాటు నాన్నతో ఎప్పటివో షూటింగ్ పిక్స్ అని షేర్ చేసింది. దీంతో ఈ మ్యాటర్ చదివిన తర్వాత కూల్ అయ్యారు నెటిజన్లు, అభిమానులు.

Bigg Boss : హిందీ బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తెలుసా?.. విన్నర్‌కి క్యాష్‌ ప్రైజ్‌తో పాటు..

ఇది ఓ మలయాళ సినిమా షూటింగ్ లో తీసుకున్న పిక్ అని, ఇప్పుడు పోస్ట్ చేసింది అని తెలుస్తుంది. చాలా మంది ఇది నిజం అనుకోని కంగ్రాట్స్ చెప్పగా.. కొంతమంది షూటింగ్ పిక్స్ అని క్లారిటీ ఇస్తే బాగుండేదని ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి అనుపమ నిన్న పెట్టిన ఫొటోలతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది.

ట్రెండింగ్ వార్తలు