NTR Film Awards : కళావేదిక – ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కోసం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

తాజాగా కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు.

Kalavedika NTR Film Awards : ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక అన్ని రంగాల్లో పనులన్నీ చకచకా మొదలుపెట్టిస్తున్నారు. సినిమా వాళ్ళతో చంద్రబాబు నాయుడుకి మంచి సంబంధాలే ఉన్నాయని తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంపై సినీ పరిశ్రమ సంతోషంగా ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుని కూడా పలువురు ప్రముఖులు ఇప్పటికే కలిశారు.

తాజాగా కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి. తారకరామారావు గారి పేరుతో సినిమా రంగంలోని విభాగాలలో పలువురు కళాకారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ఎప్పట్నుంచో అవార్డులను అందిస్తుంది. ఈ సంవత్సరం కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక 29 జూన్ 2024న హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరగనుంది. RV రమణమూర్తి కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

Also Read : Vishwak Sen : అవయవ దానం చేసిన విశ్వక్ సేన్.. అభినందిస్తున్న ఫ్యాన్స్, నెటిజన్లు..

తాజాగా కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక పోస్టర్ ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న టీమ్ అంతా చంద్రబాబుని కలిసి ఈ వేడుక గురించి తెలియచేసి ఆయనతో పోస్టర్ లాంచ్ చేయించారు. చంద్రబాబు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అతిధులుగా హాజరు కానున్నారు. త్వరలోనే ఈ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలు తెలియచేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు