Sitara Ghattamaneni Shares Cute Photos with Mahesh babu and says Fathers Day Special Wishes
Sitara – Mahesh Bbau : మహేష్ బాబు కూతురిగా సితార అందరికి పరిచయమైనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ ఫోటోలు, పలు వీడియోలు షేర్ చేస్తుంది సితార. తన ఫ్యామిలీ ఫోటోలు, ఫ్రెండ్స్ ఫోటోలు, ఫ్యామిలీ ట్రిప్ కి సంబంధించినవి షేర్ చేస్తూ మహేష్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తుంది. దీంతో చిన్న ఏజ్ లోనే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ని సంపాదించుకుంది సితార.
Also Read : Ram Charan – Chiranjeevi : మా నాన్న అందులో నాతో పోటీ పడతాడు.. నా కంటే మా నాన్నే బిజీగా ఉన్నాడు..
ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ వెళ్లిన సంగతి తెల్సిందే. మహేష్ ఫ్యామిలీ అక్కడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సితార నేడు ఫాదర్స్ డే సందర్భంగా మహేష్ బాబుతో దిగిన ఫోటోలను షేర్ చేసి స్పెషల్ పోస్ట్ పెట్టింది. సితార నాన్న ఒళ్ళో పడుకొని సరదాగా అల్లరి చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.. నువ్వు నా సూపర్ హీరో అంటూ పోస్ట్ చేసింది.
సితార తన సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవ్వాల్సిందే. దీంతో ఈ ఫాదర్స్ డే స్పెషల్ పోస్ట్ కూడా వైరల్ గా మారింది. మహేష్ తో ఇలా సరదాగా ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.