Ram Charan – Chiranjeevi : మా నాన్న అందులో నాతో పోటీ పడతాడు.. నా కంటే మా నాన్నే బిజీగా ఉన్నాడు..

రామ్ చరణ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తండ్రి చిరంజీవి గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Ram Charan – Chiranjeevi : మా నాన్న అందులో నాతో పోటీ పడతాడు.. నా కంటే మా నాన్నే బిజీగా ఉన్నాడు..

Ram Charan says Interesting Facts about Megastar Chiranjeevi

Ram Charan – Chiranjeevi : RRR తర్వాత రామ్ చరణ్ కి వస్తున్న గుర్తింపు చూసి తండ్రిగా చిరంజీవి ఆనందంతో పొంగిపోతున్నాడు. ఇప్పటికే పలుమార్లు స్టేజిపై రామ్ చరణ్ ని చూసి గర్విస్తున్నాను అని తెలిపాడు. నార్త్ లో అయితే చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్తున్నారు. కొడుకుగా చరణ్ సాధిస్తున్న విజయాలకు చిరంజీవి సంతోషంలో తేలుతున్నాడు. తాజాగా రామ్ చరణ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తండ్రి చిరంజీవి గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

రామ్ చరణ్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. మా నాన్న కష్టపడటం, మాట్లాడే విధానం నాకు చాలా ఇష్టం. తనకి ఎవరి సినిమా అయినా నచ్చితే వాళ్ళకి ఫోన్ చేసి మరీ అభినందిస్తాడు. మా నాన్న నమ్మింది చేస్తాడు. ఇప్పటికీ నాతో పోటీ పడతాడు. రోజూ ఉదయం 5 గంటలకే లేచి నాతో పోటీగా జిమ్ చేస్తాడు. నటుడు కాబట్టి ఈ వయసులో కూడా అంతా ఫిట్ గా ఉండటానికి కష్టపడుతున్నాడు. రెగ్యులర్ గా డైరెక్టర్స్ ని కలుస్తూ, కథలు వింటూ ఉంటాడు మా నాన్న. నా కంటే ప్రస్తుతం మా నాన్నే బిజీ నటుడు. నా చేతిలో రెండు సినిమాలు ఉంటే మా నాన్న చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. మా నాన్నకి వయస్సు పెరిగింది అని నేను అనుకోను. ఆయన రివర్స్ ఏజింగ్ లో ఉన్నాడు అని తెలిపాడు.

Also Read : Ram Charan : క్లిన్ కారా కోసం రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం.. నిరాశలో అభిమానులు.. ఇకపై సినిమాలు..

అలాగే చరణ్ కి ఇటీవల వచ్చిన విజయాలు చూసి చిరంజీవి చరణ్ తో.. నువ్వు ఎంత సక్సెస్ అయ్యావో నేను పట్టించుకోను కానీ ఎప్పటికి క్రమశిక్షణగా ఉండాలి, నీ చుట్టూ కూడా పని పట్ల అంకితభావంతో ఉన్నవాళ్లు ఉండాలి. నీకు బ్యాడ్ డేస్ వచ్చినా నీ క్రమశిక్షణ కాపాడుతుంది నిన్ను అని చెప్పినట్లు తెలిపాడు చరణ్. మా నాన్నే నా రోల్ మోడల్ అని అన్నాడు చరణ్. దీంతో చిరంజీవి గురించి చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.