Vishwak Sen : అవయవ దానం చేసిన విశ్వక్ సేన్.. అభినందిస్తున్న ఫ్యాన్స్, నెటిజన్లు..

విశ్వక్ సేన్ తాజాగా ఆర్గాన్ డొనేషన్ కి సంబంధించిన ఓ కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నాడు.

Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో వచ్చి తన మాస్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా విశ్వక్ ఓ మంచి పని చేయడంతో అందరూ అభినందిస్తున్నారు.

విశ్వక్ సేన్ తాజాగా ఆర్గాన్ డొనేషన్ కి సంబంధించిన ఓ కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంకి గెస్ట్ గా వచ్చిన విశ్వక్ సేన్ అవయవ దానం గురించి తెలుసుకొని తాను కూడా అవయవ దానం చేస్తాను అని అప్పటికప్పుడు ప్రకటించాడు. మరణించిన తర్వాత తన అవయవాలను దానం చేస్తానని రాసిచ్చాడు. మన అవయవ దానం వల్ల వేరొకరికి జీవితాన్ని ఇస్తామని తెలిసి తను కూడా దీనికి ఓకే చెప్పినట్టు తెలిపాడు.

Also Read : Sitara – Mahesh : ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నతో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన సితార పాప.. సూపర్ హీరో అంటూ..

విశ్వక్ సేన్ అవయవ దానం చేసాడని తెలిసి అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు. విశ్వక్ లో ఇంత మంచి కోణం కూడా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. తన సినిమాలు, స్పీచ్ లు, ప్రమోషన్స్ తో కాక విశ్వక్ ఇలా ఓ మంచి పని చేసి కూడా వైరల్ అవుతున్నాడు.

 

ట్రెండింగ్ వార్తలు