Ram Charan : క్లిన్ కారా కోసం రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం.. నిరాశలో అభిమానులు.. ఇకపై సినిమాలు..

రామ్ చరణ్ తండ్రిగా క్లిన్ కారాకు ఎక్కువ సమయమే కేటాయిస్తున్నాడు.

Ram Charan : మెగా ఫ్యామిలీలోకి క్లిన్ కారా వచ్చిన తర్వాత కుటుంబం అంతా మరింత హ్యాపీగా ఉంది. ఇక తండ్రిగా రామ్ చరణ్ ఆనందంతో పొంగిపోతున్నాడు. తండ్రి ప్రమోషన్ ని ఆస్వాదిస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు క్లిన్ కారా ఫోటోలు బయట పెట్టినా ఎక్కడా ఫేస్ చూపించలేదు. రామ్ చరణ్ తండ్రిగా క్లిన్ కారాకు ఎక్కువ సమయమే కేటాయిస్తున్నాడు. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ నేషనల్ మీడియాకు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

చరణ్ ఈ ఇంటర్వ్యూలో తన సినిమాలు, తన ఫ్యామిలీ, తన కూతురు గురించి, తండ్రి అయ్యాక తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి.. ఇలా పలు ఆసక్తికర అంశాలు మాట్లాడాడు. అయితే ఈ క్రమంలో క్లిన్ కారాకు సమయం ఇవ్వడం కోసం కొన్నాళ్ళు సినిమాలు స్లోగా చేస్తాను అని ఇండైరెక్ట్ గా చెప్పాడు చరణ్.

Also Read : Sai Dharam Tej : పవన్ కళ్యాణ్‌కి గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు.. చిన్నపిల్లాడిలా ఏం ఇచ్చాడో తెలుసా?

రామ్ చరణ్ మాట్లాడుతూ.. క్లిన్ కారాని వదిలి వెళ్ళడానికి నాకు కష్టంగా ఉంది. తనకి నేను బానిస అయిపోయాను. షూటింగ్స్ కి వెళ్తే తనని నేను మిస్ అవుతున్నాను. ఇప్పటివరకు 15 ఏళ్లుగా కష్టపడ్డాను. టైమింగ్స్ పట్టించుకోకుండా షూటింగ్స్ చేశాను. కానీ ఇకపై నా కూతురికి సమయం ఇవ్వాలి అనుకుంటున్నాను. అందుకే లోకల్ లో షూటింగ్ ఉంటే మాత్రం సాయంత్రం 6 గంటలకు పూర్తి చేసేసి వస్తాను. నా నిర్మాతలకు కూడా ఈ విషయం ముందే చెప్తున్నాను. నా కూతురు స్కూల్ కి వెళ్ళేవరకు తనతోనే ఎక్కువ సమయం గడపాలి అనుకుంటున్నాను. దానికి తగ్గట్టే నా వర్క్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటాను అని తెలిపాడు.

దీంతో క్లిన్ కారా కోసం కొన్నాళ్ళు సినిమాలని స్లోగా చేద్దాం, ఒకటి అయ్యాక ఇంకొకటి మొదలు పెడదాం అనే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పటికి చరణ్ చేతిలో అధికారికంగా శంకర్, బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత పలు దర్శకులతో సినిమా చేస్తాడని వార్తలు వచ్చినా ఏది అధికారికంగా ప్రకటించలేదు.

Also Read : Ram Charan – Klin Kaara : ఫాదర్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ.. క్లిన్ కారా గురించి రామ్ చరణ్ చెప్పిన బోలెడన్ని విషయాలు..

అలాగే షూటింగ్స్ కి కూడా ఒకేసారి కాకుండా క్లిన్ కారాని దృష్టిలో పెట్టుకొని డేట్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. క్లిన్ కారా స్కూల్ కి వెళ్లే వరకు ఇలాగే అంటే కనీసం నాలుగేళ్లు చరణ్ ఇలాగే నిదానంగా సినిమాలు చేస్తే ఈ నాలుగేళ్లలో మూడు సినిమాలు కూడా వచ్చేలా లేవు. ఇప్పటికే చరణ్ ని తెరపై చూసి రెండేళ్లు అవుతుంది. చరణ్ ఇలా చెప్పడంతో సినిమాలు చాలా తక్కువ వస్తాయి, లేట్ గా వస్తాయని అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే గేమ్ చెంజర్ అనౌన్స్ చేసి మూడేళ్లు అవుతున్నా ఇంకా సినిమా రాకపోవడంతో ఫ్యాన్స్ ఈ విషయంలో చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు