Tammudu Re Release : వామ్మో ఇదెక్కడి మాస్ సెలబ్రేషన్స్ రా బాబు.. డిప్యూటీ సీఎం సినిమా రీ రిలీజ్..

తమ్ముడు రీ రిలీజ్ తో థియేటర్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడి చేశారు.

Tammudu Re Release : ఇటీవల పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఇప్పటికే ఖుషి, వకీల్ సాబ్, బద్రి.. ఇలా పలు విసినిమాలు రీ రిలీజ్ అవ్వగా తాజాగా నిన్న తమ్ముడు సినిమా రీ రిలీజ్ అయింది. తమ్ముడు సినిమా రిలీజయి 25 ఏళ్ళు అవడంతో ఈ సినిమా రీ రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

తమ్ముడు రీ రిలీజ్ తో థియేటర్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడి చేశారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ భారీగా పిఠాపురంలో గెలవడం, జనసేన అన్ని స్థానాలు గెలవడం, పవన్ ఏపీకి డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి అవ్వడంతో అభిమానులు ఇప్పటికే ఫుల్ జోష్ లో ఉన్నారు. దీంతో తమ్ముడు రీ రిలీజ్ ని మరింత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

Also Read : NTR Film Awards : కళావేదిక – ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కోసం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

డిప్యూటీ సీఎం సినిమా రీ రిలీజ్ అంటూ, డిప్యూటీ సీఎం 25 ఏళ్ళ క్రితం ఇలా అదరగొట్టాడు అంటూ తమ్ముడు రీ రిలీజ్ సెలబ్రేషన్స్ వీడియోలు షేర్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ వద్ద పవన్ హీరోగా కాకుండా రాజకీయ నాయకుడిగా కనిపించే పెద్ద కటౌట్ ఏర్పాటు చేశారు. అంతే కాక ఆ కటౌట్ చుట్టూ ఫైర్ వర్క్స్ కాల్చి, పేపర్లు, పూలు భారీగా ఎగరేసి, థియేటర్ బయట డీజే పెట్టి డ్యాన్సులు వేస్తూ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో ఈ విజువల్స్ చూసి రీ రిలీజ్ సినిమాకు ఇవెక్కడి మాస్ సెలబ్రేషన్స్ రా నాయనా అని ఆశ్చర్యపోతున్నారు. పవన్ అభిమానులు అంటేనే మాములు హంగామా చేయరు, అలాంటిది గత కొన్ని రోజులుగా పవన్ విజయాలు చూస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు మరి ఈ మాత్రం సెలబ్రేషన్స్ ఉండవా అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు