Apple iPhone 11 massive discount on Flipkart : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 11 (Apple iPhone 11) ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ మోడల్‌లలో ఒకటి. 2019లో ఆపిల్ లాంచ్ చేసిన ఐఫోన్ 11 సిరీస్ కర్వడ్ ఎడ్జ్‌లతో వచ్చిన కంపెనీ చివరి లైనప్ ఇదే. వార్షిక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా (Apple iPhone 11)కి అద్భుతమైన స్పందన లభించింది.
మీరు బడ్జెట్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. రూ. 36,250 డిస్కౌంట్ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 2,749కే ఆపిల్ iPhone 11 కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11 ధర రూ.4,901 తగ్గింపు తర్వాత రూ.38,999కు చేరింది.
ఐఫోన్ కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీపై ఫ్లాట్ రూ. 1,250 తగ్గింపును పొందవచ్చు, దాంతో ఈ డివైజ్ ధర రూ. 37,749కి తగ్గుతుంది. అంతేకాదు.. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11పై రూ. 35,000 వరకు తగ్గింపును అందిస్తోంది. రూ. 36,250 తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్ నుంచి కేవలం రూ. 2,749కి ఆపిల్ ఐఫోన్ 11ని పొందవచ్చు.
Apple iPhone 11 gets massive Rs 36,250 discount in Flipkart sale, available at Rs 2,749
ఆపిల్ ఐఫోన్ SE 3 5G అమ్మకాలు భారీగా తగ్గిపోవడంతో ఆపిల్ కంపెనీ తమ ఐఫోన్ 11 సిరీస్‌ను గత ఏడాదిలో నిలిపివేసింది. ఆపిల్ ఐఫోన్ 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్ప్లేతో కూడిన స్పెసిఫికేషన్లతో వస్తుంది. హుడ్ కింద A13 బయోనిక్ చిప్సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. వెనుకవైపు డ్యూయల్ 12MP సెన్సార్, ముందు భాగంలో 12MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది.