Arjuna Phalguna : ట్రైలర్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ని బాగానే వాడారుగా..

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్‌గా శ్రీ విష్ణు.. గ్రామ వాలంటీర్‌గా హీరోయిన్!

Arjuna Phalguna: ఇటీవల ‘రాజ రాజ చోర’ అనే డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ప్రామిసింగ్ యాక్టర్ శ్రీ విష్ణు, ఇప్పుడు ‘అర్జున ఫల్గుణ’ అనే మరో క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అమిృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Bigg Boss 6 Telugu : నాగార్జున సరికొత్త ప్రయోగం.. 24 గంటల పాటు లైవ్!

ఫస్ట్ మూవీ ‘జోహార్’ తో ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తేజ మర్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ‘అర్జున ఫల్గుణ’ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో శ్రీవిష్ణు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా కనిపించనుండగా.. హీరోయిన్ గ్రామ వాలంటీర్‌గా నటిస్తోంది.

Sree Vishnu : ఎన్టీఆర్ ఫ్యాన్‌గా శ్రీ విష్ణు.. గ్రామ వాలంటీర్‌గా హీరోయిన్!

ట్రైలర్ ఫన్ అండ్ థ్రిల్లింగ్‌గా అనిపించడమేకాక సినిమా మీద అంచనాలు పెంచేసింది. సినిమా కాన్సెప్ట్ ఏంటనేది క్లుప్తంగా చూపించారు ట్రైలర్‌లో. శ్రీ విష్ణు మరోసారి తన నేచురల్ పర్ఫార్మెన్స్‌తో అలరించబోతున్నాడని అర్థమవుతోంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. డిసెంబర్ 31న ‘అర్జున ఫల్గుణ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ట్రెండింగ్ వార్తలు