Vishwak Sen : త్రివిక్రమ్ చూడకుండానే మా సినిమా రిలీజ్ చేస్తున్నాం..

సాధారణంగా సితార ఎంటరైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమాలను త్రివిక్రమ్ చూసి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు.

Trivikram : విశ్వక్‌ సేన్(Vishwak Sen), నేహశెట్టి (Neha Shetty) జంటగా అంజలి (Anjali) ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’(Gangs Of Godavari). సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడ్డ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

విశ్వక్ సేన్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. సాధారణంగా సితార ఎంటరైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమాలను త్రివిక్రమ్ చూసి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి స్క్రిప్ట్ విషయంలో కూడా సపోర్ట్ చేస్తారు. ఆ నిర్మాతలతో త్రివిక్రమ్ కి ఉన్న అనుబంధంతో అందులో తెరకెక్కే ప్రతి సినిమాకి త్రివిక్రమ్ ఏదో రకంగా సహకారం అందిస్తారు. ఇటీవల వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాలో కూడా త్రివిక్రమ్ సపోర్ట్ ఉందని సిద్ధూ జొన్నలగడ్డ తెలిపాడు. అయితే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా త్రివిక్రమ్ అసలు చూడలేదంట.

Also Read : Parakramam : పరాక్రమం టీజర్ చూశారా? బోల్డ్ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ మళ్ళీ వచ్చేశాడు..

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. మా సినిమా నుంచి త్రివిక్రమ్ గారు ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదు. ఓ సారి ఫంక్షన్ లో కలిసినప్పుడు సినిమా రెడీ అయింది, ఒకసారి మీరు చూడండి అని కూడా అడిగాను. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ మా సినిమా చూసి అభిప్రాయం చెప్తే బాగుంటుంది అనుకున్నాను. అయితే త్రివిక్రమ్ గారు మా సినిమా ఇంకా చూడలేదు అని తెలిపారు. దీంతో త్రివిక్రమ్ సినిమా చూడకుండానే సితార ఎంటెర్టైమెంట్స్ నుంచి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ అవుతుందా అని సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే రిలీజ్ కి ఇంకో అయిదు రోజులు ఉండటంతో ఈ లోపు చూసే అవకాశం కూడా ఉందని, లేదా ప్రీమియర్స్ లోనే డైరెక్ట్ గా సినిమా చూస్తారని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు