Sitara Ghattamaneni : మహేష్ కూతురు సితార ఇప్పుడు ఏ క్లాస్ చదువుతుందో తెలుసా?

తాజాగా సితార ఓ కార్యక్రమంలో పాల్గొనగా అక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.

Sitara Ghattamaneni : మహేష్ బాబు(Mahesh Babu) కూతురిగా సితార అందరికి పరిచయమైనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడూ ఫోటోలు, పలు వీడియోలు షేర్ చేస్తూ, ఇటీవల ఓ యాడ్ లో కూడా నటించి, మరో పక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ చిన్న ఏజ్ లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ని సంపాదించుకుంటుంది.

సితార తన సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా, బయట ఎక్కడ కనపడినా వైరల్ అవ్వాల్సిందే. తాజాగా సితార ఓ కార్యక్రమంలో పాల్గొనగా అక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ క్రమంలో ఓ చిన్ని పాప సితారని ఏ క్లాస్ చదువుతున్నావు అని అడగ్గా సితార సమాధానమిస్తూ.. ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అయిపోయింది. సెవెంత్ లోకి వెళ్తాను అని తెలిపింది.

Also Read : Sitara Ghattamaneni : రాజమౌళి సినిమా కోసం పెంచిన మహేష్ బాబు జుట్టుపై సితార ఆసక్తికర వ్యాఖ్యలు..

దీంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సితార ఇంకా సెవెంత్ క్లాసా అని ఆశ్చర్యపోతూనే ఇంత చిన్న ఏజ్ లోనే చాలా యాక్టివ్ గా ఉంటూ, సేవా కార్యక్రమాలు, సోషల్ మీడియాలో డ్యాన్సులు .. చేస్తూ అభిమానులకు దగ్గరవడం గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదే కార్యక్రమంలో తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని, నేను ఇంకా చిన్న ఏజ్ లోనే ఉన్నాను, ఫ్యూచర్ లో నటిస్తాను అని తెలిపింది సితార.

ట్రెండింగ్ వార్తలు