Sitara Ghattamaneni : రాజమౌళి సినిమా కోసం పెంచిన మహేష్ బాబు జుట్టుపై సితార ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇటీవల మహేష్ జుట్టు బాగా పెంచిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.

Sitara Ghattamaneni : మహేష్ బాబు(Mahesh Babu) రాజమౌళి సినిమా కోసం తన బాడీ, జుట్టు పెంచుతున్నారు. ఇటీవల మహేష్ జుట్టు బాగా పెంచిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మహేష్ ఓ పెళ్ళికి వెళ్లగా అక్కడ మహేష్ బాబు అక్క మంజుల ఆ జుట్టు ఏంటి ఇంత పెంచేసావు అన్నట్టు జుట్టు పట్టుకొని మరీ చూసింది. కాసేపు వీళ్లిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. మంజుల, మహేష్ నవ్వుతూ మాట్లాడుకున్న వీడియో, మంజుల మహేష్ జుట్టు పట్టుకున్న అక్కాతమ్ముళ్ల వీడియోలు వైరల్ అయ్యాయి.

Also Read : Vishwak Sen : త్రివిక్రమ్ చూడకుండానే మా సినిమా రిలీజ్ చేస్తున్నాం..

తాజాగా సితార ఘట్టమేని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ సంఘటనపై మాట్లాడింది. సితార మాట్లాడుతూ.. ఆ రోజు మా నాన్న జుట్టు పట్టుకొని చూసింది. నా జుట్టు టచ్ చేయొద్దు అని నాన్న అన్నారు. మా నాన్నకి ఎవరైనా తన జుట్టు పట్టుకుంటే నచ్చదు. అందుకే మేము టచ్ చేయాలని చూస్తాము. చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ అని తెలిపింది. దీంతో సితార చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు