Balakrishna : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య బాబు..

తాజాగా బాలకృష్ణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Balakrishna : మొన్నటి వరకు ఏపీలో ఎన్నికలు ఉండటంతో ప్రచారంలో బిజీగా ఉన్న బాలకృష్ణ ఎలక్షన్స్ అయ్యేంతవరకు ఏపీలోనే ఉన్నారు. ఎన్నికలు అయ్యాక బాలయ్య బాబు హైదరాబాద్ వచ్చి ఇప్పుడు మళ్ళీ సినిమాలు, బసవతారకం హాస్పిటల్ పనులు చూస్తున్నారు. ఇటీవలే కాజల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కూడా వచ్చారు బాలయ్య. ఇక డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూట్ కూడా మొదలుపెట్టినట్టు సమాచారం.

Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చిన అంజలి.. చరణ్‌తో ఫ్లాష్ బ్యాక్‌లో..

తాజాగా బాలకృష్ణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన బసవతారకం హాస్పిటల్ కి చెందిన పలువురితో కలిసి బాలయ్య రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, బాలయ్య బాబు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. సీఎం రేవంత్ తో బాలయ్య కొద్దిసేపు మాట్లాడి వెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు