Indian birds : భారతీయ పక్షులు పెంచుకోవడంపై నిషేధం : బెంగాల్ అటవీశాఖ మంత్రి వెల్లడి

పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పక్షుల పెంపకంపై నిషేధాస్త్రం విధించింది. భారతీయ పక్షులైన చిలుకలు, కాకాటూ, మునియాలను ఇళ్లలో పెంచుకోవడాన్ని నిషేధిస్తూ పశ్చిమబెంగాల్ అటవీ శాఖ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి జ్యోతిప్త్రియో మల్లిక్ వెల్లడించారు....

Indian birds

Indian birds : పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పక్షుల పెంపకంపై నిషేధాస్త్రం విధించింది. భారతీయ పక్షులైన చిలుకలు, కాకాటూ, మునియాలను ఇళ్లలో పెంచుకోవడాన్ని నిషేధిస్తూ పశ్చిమబెంగాల్ అటవీ శాఖ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి జ్యోతిప్త్రియో మల్లిక్ వెల్లడించారు. (birds of Indian species) ఈ పక్షులను బోనుల్లో ఉంచడానికి అనుమతించమని మంత్రి చెప్పారు. (Bengal to soon ban keeping birds)

Mumbai college : ముంబయి కళాశాలలో బురఖా, హిజాబ్‌పై ఆంక్షలు

మకావ్స్ వంటి విదేశీ జాతుల పక్షులను అటవీ శాఖ నుంచి అనుమతి పొంది లైసెన్స్ ఫీజు కింద రూ.15,000 చెల్లించి పెంచుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. (Forest minister) విదేశీ పక్షుల ప్రదర్శనను బహిరంగ ప్రదేశాల్లో అనుమతించబోమని ఆయన తెలిపారు. పక్షుల పెంపకానికి సంబంధించి ఇప్పటికే ముసాయిదాను రూపొందించామని, ఈ చట్టం ఈ నెలాఖరు నాటికి అమల్లోకి వస్తుందని మంత్రి చెప్పారు.

Crop Loan Waiver : రైతులకు శుభవార్త.. నేటి నుంచి రుణమాఫీ, తొలి విడతలో రూ.19వేల కోట్లు

కోల్‌కతానగరంతో సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వారానికొకసారి పంజరంలో ఉంచిన పక్షులను విక్రయించడం గురించి అడిగిన ఒక ప్రశ్నకు, ఫిర్యాదులు వస్తే అటవీశాఖ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు. ఆరు ఆఫ్రికన్ సింహాలను న్యూ టౌన్‌లోని మినీ జూకి తీసుకురానున్నట్లు చెప్పారు. న్యూ టౌన్‌లో 12.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మినీ జూకు మరో 2.4 ఎకరాలు కేటాయించనున్నట్లు తెలిపారు. బెంగాల్ మినీ జూలో పాముల ఎన్ క్లోజరును కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

ట్రెండింగ్ వార్తలు