F3: ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘ఎఫ్3’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ‘ఎఫ్2’కు సీక్వెల్‌గా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఎఫ్2 సినిమాలో ఉన్న నటీనటులు దాదాపు అందరూ ఎఫ్3లో కూడా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎలాంటి ఫన్ను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో సునీల్, సోనాల్ చౌహాన్ కూడా యాడ్ కావడంతో ఈ చిత్రం ఎలాంటి కథతో వస్తుందా.. అది ఎంతమందికి నచ్చుతుందా.. అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొంది.
F3: ఎఫ్3 నుండి సెకండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్!
ఇప్పటికే మెజారిటీ షూటింగ్‌ను ముగించేసిన ఈ సినిమా, ప్రస్తుతం ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ పాటలో అందాల భామ పూజా హెగ్డే స్పెషల్ ఎంట్రీ ఇవ్వనుండటంతో ప్రేక్షకుల్లో ఈ పాటపై కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, తాజాగా ఈ సినిమా నుండి రెండో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే రెండో సాంగ్‌గా ‘‘ఊ.. ఆ.. అహ అహ..’’ అంటూ సాగుతున్న ఈ పాటకు సంబంధించిన ప్రోమోను చిత్ర యనిట్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు.
F3: ఎఫ్3 సెట్స్‌లో అడుగుపెట్టిన బుట్టబొమ్మ
ఎఫ్2లోని ఓ రొమాంటిక్ తరహాలోనే ఈ సాంగ్ కూడా ఉండబోతున్నట్లు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సాంగ్‌లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‌లు కలిసి చిందులేస్తున్నారు. పూర్తి రొమాంటిక్ సాంగ్‌గా రాబోతున్న ఈ పాట ట్యూన్ చాలా క్యాచీగా ఉండటంతో ప్రేక్షకులు ఈ పాటను ఎప్పుడెప్పుడు పూర్తిగా వింటామా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఎఫ్2 చిత్రం ఫన్ అండ్ ప్రస్ట్రేషన్ ముఖ్య అంశాలుగా తెరకెక్కగా, ఎఫ్3లో డబ్బు చుట్టూ సినిమా కథ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. వేసవి కానుకగా ఈ సినిమాను మే 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
Here’s a sizzling promo of the peppy song #WooAaaAhaAha?
Full Lyrical song on April 22nd?
A @ThisIsDSP Musical?#F3Movie #F3OnMay27@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @SVC_official @adityamusic pic.twitter.com/ZA9agVOJFH
— Sri Venkateswara Creations (@SVC_official) April 20, 2022