Acharya Vinod Kumar : ప్రభాస్ పెళ్లిపై ప్రముఖ జ్యోతిష్కుడు జ్యోస్యం.. ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే..

ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పటికి హాట్ న్యూసే. 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ లోను అంతా ప్రభాస్ పెళ్లి గురించే అడుగుతున్నారు. తాజాగా ప్రభాస్‌ వివాహం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది..........

Prabhas Marriage :  మన టాలీవుడ్ హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరన్నా ఉన్నారంటే అది ప్రభాస్ ఒక్కడే. 42 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి గురించి ఆలోచించకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరన్నా పెళ్లి గురించి అడిగితే చేసుకుందాం అని ఒక చిన్న నవ్వు నవ్వేసి వదిలేస్తున్నారు. గతంలో ‘బాహుబలి’ సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటానని వాళ్ల ఇంట్లో చెప్పినట్లు ప్రభాస్‌ స్వయంగా తెలిపాడు. కానీ ఇప్పటి వరకు కూడా పెళ్లి గురించి చెప్పలేదు ప్రభాస్.

ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పటికి హాట్ న్యూసే. ‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్ లోను అంతా ప్రభాస్ పెళ్లి గురించే అడుగుతున్నారు. తాజాగా ప్రభాస్‌ వివాహం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు ఆచార్య వినోద్‌ కుమార్‌ ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ తాజాగా ఓ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో చెప్పారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.

Alia Bhatt : హాలీవుడ్‌లోకి అలియా ఎంట్రీ..

ఆచార్య వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ”హీరో ప్రభాస్‌ త్వరలోనే వివాహం చేసుకుంటారు. అక్టోబర్‌ 2022 నుంచి అక్టోబర్‌ 2023 మధ్యలో ఎప్పుడైనా ప్రభాస్ పెళ్లి జరగవచ్చు. మోస్ట్‌ హ్యాండ్సమ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ విషయంలో ఇది నా జ్యోతిష్యం” అని తెలిపారు. మరి ఈ జ్యోతిష్యుడు చెప్పినట్టు ప్రభాస్‌ వివాహం మరో సంవత్సరంలోపు జరుగుతుందా? లేదా? చూడాలి. ఈ జ్యోతిష్కుడు చెప్పినట్టు కనుక ప్రభాస్ పెళ్లి జరిగితే ప్రభాస్ అభిమానులంతా ఆనందిస్తారు. ఇక ప్రభాస్‌ కూడా ‘రాధేశ్యామ్’ సినిమాలో హస్తాసాముద్రికా నిపుణుడిగా నటించిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు