Hit List : హిట్ లిస్ట్ ట్రైలర్ చూశారా? వెంకటేష్ వసంతం డైరెక్టర్ కొడుకు హీరోగా..

తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తుండటంతో తెలుగులో కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.

Hit List : తమిళ స్టార్ డైరెక్టర్, తెలుగులో వెంకటేష్ తో వసంతం లాంటి మంచి సినిమాని తీసిన దర్శకుడు విక్రమన్ తనయుడు విజయ్ కనిష్క హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన సినిమా ‘హిట్ లిస్ట్’. సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రల్లో నటించారు. సూర్య కతిర్ కాకల్లార్, కే.కార్తికేయన్ దర్శకత్వంలో RK సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ KS రవికుమార్ నిర్మాణంలో ఈ హిట్ లిస్ట్ సినిమా తెరకెక్కింది.

Also Read : Varun Sandesh : మానసిక వైకల్యం స్పెషల్ స్కూల్‌లో పిల్లలతో సాంగ్ రిలీజ్ చేపించిన వరుణ్ సందేశ్..

ఇటీవల హీరో సూర్య టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తుండటంతో తెలుగులో కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మూవీ యూనిట్ తో పాటు అతిథులుగా మురళీమోహన్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు. తెలుగులో ఈ సినిమాని నిర్మాతలు శ్రీనివాస్ గౌడ్, బెక్కం రవీంద్ర రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే ఓ సైకోకి, సాధారణ వ్యక్తికి, పోలీస్ కి, రౌడీ కి మధ్య జరిగే క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా ఉంది. ఈ హిట్ లిస్ట్ సినిమా తెలుగు, తమిళ్ లో మే 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మీరు కూడా ట్రైలర్ చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు