Bhaje Vaayu Vegam trailer : కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైల‌ర్ విడుద‌ల‌..

హీరో కార్తికేయ న‌టిస్తున్న మూవీ ‘భజే వాయు వేగం’.

Bhaje Vaayu Vegam : ‘బెదురులంక 2012’ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న హీరో కార్తికేయ న‌టిస్తున్న మూవీ ‘భజే వాయు వేగం’. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ క‌థానాయిక‌. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యింది.

ఈ సినిమా మే 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈక్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగంగా పెంచింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, పాటలు ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

Love Me : ‘లవ్ మీ’ మూవీ రివ్యూ.. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య రెండో సినిమాతో హిట్ కొట్టిందా?

‘హైద‌రాబాద్ మొత్తాన్ని అల‌ర్ట్ చేసాం.. ప్ర‌తి చెక్‌లోనూ క్లీన్‌గా చెక్ చేస్తున్నాం.’ అనే వాయిస్ ఓవ‌ర్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ట్రైల‌ర్ చూస్తుంటే.. డ‌బ్బులున్న బ్యాగ్‌ను హీరో కార్తికేయ తీసుకువెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. ఆ బ్యాగు కోసం కొన్ని గ్రూపులు అత‌డి వెంట ప‌డుతుంటాయి. మ‌రీ డ‌బ్బులున్న ఉన్న బ్యాగ్ కార్తికేయ‌కు ఎలా దొరికింది? వాటితో అత‌డు ఏం చేశాడు? త‌న వెంట ప‌డుతున్న వారి నుంచి అత‌డు ఎలా త‌ప్పించుకున్నాడు వంటి విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కాగా.. మొత్తానికి ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది.

ట్రెండింగ్ వార్తలు