Music Shop Murthy : మెయిన్ లీడ్‌గా అజయ్ ఘోష్.. మ్యూజిక్ షాప్ మూర్తి రిలీజ్ ఎప్పుడంటే..?

తాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Music Shop Murthy : పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా ఉన్న అజయ్ ఘోష్ ఇప్పుడు మెయిన్ లీడ్ లో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాతో రాబోతున్నారు. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాణంలో శివ పాలడుగు దర్శకత్వంలో ఈ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు.

తాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి రిలీజ్ డేట్ ని ప్రకటించారు. జూన్ 14న మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజవనుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాని అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డీజే టిల్లు.. ఇలా వరుస హిట్స్ సాధిస్తున్న ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ రిలీజ్ చేస్తుంది.

మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా అజయ్ ఘోష్ ఓ మ్యూజిక్ షాప్ నడుపుతూ డీజే కావాలనుకుంటాడు. ఆ ఏజ్ లో డీజే అయ్యాడా దానికి చాందిని చౌదరి ఎలా సపోర్ట్ చేసింది అనే ఆసక్తికర కథతో తెరకెక్కించారు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి.. పలువురు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు