Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పిసినారి.. కనీసం అవి కూడా వాడడు.. రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను సంచలన వ్యాఖ్యలు..
తాజాగా రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను సుడిగాలి సుధీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. (Sudigali Sudheer)
Sudigali Sudheer
Sudigali Sudheer : జబర్దస్త్ షోతో గెటప్ శ్రీను, సుధీర్, రామ్ ప్రసాద్ ముగ్గురు మంచి ఫేమ్ తెచ్చుకొని స్టార్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ మంచి ఫ్రెండ్స్. సుధీర్ ఇప్పుడు జబర్దస్త్ మానేసి హీరోగా, యాంకర్ గా బిజీగా ఉండగా గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ మానేసి సినిమాల్లో కమెడియన్ గా బిజీగా ఉన్నాడు. రామ్ ప్రసాద్ మాత్రం ఇంకా జబర్దస్త్ చేస్తున్నాడు.(Sudigali Sudheer)
తాజాగా రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను యాంకర్ సుమ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సుడిగాలి సుధీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.
Also See : Kajal Aggarwal : ఫిలిం ఫేర్ ఈవెంట్ కోసం ముస్తాబయిన కాజల్ అగర్వాల్.. ఫొటోలు..
రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను మాట్లాడుతూ.. సుధీర్ పిసినారి. మా ముగ్గురిలో వాడే పిసినారి. వాడు ఇప్పటికి కూడా ఫోన్ పే, గూగుల్ పే వాడడు. ఎవరైనా డబ్బుల విషయం గురించి మాట్లాడితే, డబ్బులు అడిగితే మా నాన్నని అడగండి, మా నాన్నతో మాట్లాడండి అని చెప్తాడు. కార్డు మాత్రం వాడతాడు బయటకు వెళ్తే అంతే. మాతో వస్తే అది కూడా తీసుకురాడు అని అన్నారు.
దీంతో వీరి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సుధీర్ అంత పిసినారా అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే ఫోన్ పే, గూగుల్ పే కూడా వాడడా అని ఆశ్చర్యపోతున్నారు.
Also Read : Ram Prasad : 9 ఏళ్ళు కలిసి ట్రావెల్ చేసి వెళ్లిపోయారు.. సుధీర్, గెటప్ శ్రీను కోసం రామ్ ప్రసాద్ ఎమోషనల్..
