Aura Of Ustaad : పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్.. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ వచ్చేసింది..
మీరు కూడా ఈ సాంగ్ వినేయండి.. (Aura Of Ustaad)
Aura Of Ustaad
Aura Of Ustaad : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ఒక సాంగ్ రిలీజ్ చేయగా నేడు మరో సాంగ్ రిలీజ్ చేసారు.
Also Read : Priyanka Chopra : వారణాసి హీరోయిన్ పై రాజకీయాలు.. స్టార్ హీరోయిన్ అయినా సరే.. పాపం..
ఈ ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ని దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ రాయగా దేవిశ్రీ ప్రసాద్, అభిషేక్ పాడారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
‘నేను మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే’ అనే లైన్ తో మొదలయి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించే తెలిసేలా ఈ సాంగ్ ని పవర్ఫుల్గా రాశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ పాటని వైరల్ చేస్తున్నారు.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. నేను మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే సినిమాలో ఒక సన్నివేశంలో ఈ డైలాగ్ వస్తుంది. పవన్ గారు రెండు దశాబ్దాల నుంచి ఈ మేనరిజమ్ చేస్తున్నారు. దీన్ని మాట రూపంలో చెప్తే బాగుంటుంది అనిపించి ఈ డైలాగ్ రాసాను. ఈ డైలాగ్ ని హుక్ లైన్ గా తీసుకొని మంచి పాటగా చంద్రబోస్ గారు రాసారు. ఎనిమిది గంటల్లో పాట రెడీ అయింది. ఆయన మీద అవగాహనతో రాసిన పాట ఇది. పవన్ కళ్యాణ్ గారికి దేవి శ్రీ ప్రసాద్ పాటాభిషేకం చేస్తే, చంద్రబోస్ గారు సిరాభిషేకం చేశారు. కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం రోజుకి 18 గంటలు కష్టపడ్డారు అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఒక్కసారి మనిషి నచ్చాడంటే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు కళ్యాణ్ గారు. దేఖ్లేంగే సాలా సాంగ్ విని చాలా రోజుల తరువాత నాకు డ్యాన్స్ చేయాలనే ఉత్సాహం కలిగిందని పవన్ కళ్యాణ్ గారు నన్ను అభినందించారు. ఈ పాట విని నాకు ఫోన్ చేసి చాలా బాగుందని అభినందించారు అని తెలిపారు.
