Varun Sandesh : మానసిక వైకల్యం స్పెషల్ స్కూల్‌లో పిల్లలతో సాంగ్ రిలీజ్ చేపించిన వరుణ్ సందేశ్..

తాజాగా నింద సినిమా నుంచి ఓ పాటని రిలీజ్ చేసారు.

Varun Sandesh : కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన వరుణ్ సందేశ్ బిగ్ బాస్ లో పాల్గొని బయటకి వచ్చాక సినిమాల మీద ఫోకస్ చేసి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. వరుణ్ సందేశ్ త్వరలో ‘నింద’ అనే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథం నిర్మాతగా, దర్శకుడిగా నింద సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ నింద టైటిల్ కి కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌ ఇచ్చారు.

Also Read : Naga Chaitanya : ఇంకా షాక్‌లోనే ఉన్నా.. ప్రభాస్ బుజ్జిని టెస్ట్ డ్రైవ్ చేసిన నాగచైతన్య..

ఇటీవల నింద టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి కలిగించగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటని రిలీజ్ చేసారు. ‘కమ్ముకున్న చీకట్లు, చీకట్లలో అంతు చూడమన్న ప్రశ్నలు..’ అంటూ ఆలోచించే విధంగా సాగే పాటని నేడు రిలీజ్ చేసారు. ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా సంతు ఓంకార్ సంగీత దర్శకత్వంలో శ్రీరామచంద్ర పాడారు. మీరు కూడా ఈ పాట వినేయండి.

ఇక ఈ పాటని హైదరాబాద్ లోని మానసిక, శారీరిక వైకల్యం ఉన్న స్పెషల్ స్కూల్ గానామాస్ స్పెషల్ స్కూల్‌కి చెందిన పిల్లల మధ్య విడుదల చేశారు. ఆ పిల్లలతో వరుణ్ కాసేపు ముచ్చటించి పిల్లలతో సాంగ్ రిలీజ్ చేయించారు. ఈ కార్యక్రమంలో మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు. ఇక ఈ సినిమాలో శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు, తనికెళ్ల భరణి, భద్రమ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు