Naga Chaitanya : ఇంకా షాక్‌లోనే ఉన్నా.. ప్రభాస్ బుజ్జిని టెస్ట్ డ్రైవ్ చేసిన నాగచైతన్య..

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’.

Naga Chaitanya : ఇంకా షాక్‌లోనే ఉన్నా.. ప్రభాస్ బుజ్జిని టెస్ట్ డ్రైవ్ చేసిన నాగచైతన్య..

Naga Chaitanya Test Drive Bujji and says he is in shock

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాలో కారు కూడా కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. ఆ కారు పేరు బుజ్జి. ఈ బుజ్జిని ప‌రిచ‌యం చేసిన‌ప్ప‌టికి నుంచి అంద‌రినీ ఆక‌ట్టుంటోంది. ఇక దాన్ని ఒక్క‌సారైనా న‌డ‌పాల‌ని ఉందని అంటూ సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు కామెంట్లు పెడుతున్నారు.

అక్కినేని కుటుంబానికి కార్లు, బైకులు న‌డ‌ప‌డం అంటే ఎంత ఆస‌క్తి అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక నాగ‌చైత‌న్య రేసింగ్ గేమ్స్‌లోనూ సంద‌డి చేస్తుంటాడు. తాజాగా చెత‌న్య బుజ్జిని డ్రైవ్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం అభిమానుల‌తో పంచుకుంది.

నటి హేమకు మరో బిగ్‌షాక్‌.. 27న విచారణకు రావాలంటూ నోటీసులు

బుజ్జిని న‌డ‌ప‌డం ఎంతో అద్భుతంగా ఉంద‌ని, తానింకా షాక్‌లో ఉన్న‌ట్లు నాగ‌చైత‌న్య తెలిపాడు. ఇంజినీరింగ్ కు సంబంధించిన రూల్స్ అన్ని క‌ల్కి మూవీ టీమ్ బ్రేక్ చేసింద‌ని చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఓ కారును త‌న జీవితంలో న‌డుపుతాన‌ని ఊహించ‌లేద‌న్నాడు. ఇదొక ఇంజినీరింగ్‌ మార్వెల్‌. దర్శకుడి ఊహాశక్తిని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చిన టీమ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాడు. బుజ్జితో గడిపిన స‌మ‌యాన్ని ఎప్ప‌టికీ మ‌రువ‌లేన‌ని నాగ‌చైత‌న్య అన్నాడు.

క‌ల్కి సినిమా విష‌యానికి వ‌స్తే.. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్నితెర‌కెక్కిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్‌, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రానుంది. ‘కల్కి’ ఫస్ట్‌ పార్ట్‌ జూన్‌ 27న విడుదల కానుంది.

Bhaje Vaayu Vegam trailer : కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైల‌ర్ విడుద‌ల‌..