Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 20గంటల సమయం

తిరుమల శ్రీవారిని శనివారం 83,866 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.15కోట్లు సమకూరింది.

Tirumala Tirupati Devasthanam : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి వెలుపల కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. ఇదిలాఉంటే.. క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీటిని శ్రీవారి సేవకులు అందజేస్తున్నారు.

Also Read : భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. కొనసాగుతున్న రద్దీ, శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం

వేసవి సెలవులు ముగిసే వరకు భక్తులు రద్దీ కొనసాగనుంది. వారాంతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు ఉత్తరాలు టీటీడీ రద్దు చేసింది. ఇదిలాఉంటే.. తిరుమల శ్రీవారిని శనివారం 83,866 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.15కోట్లు సమకూరింది.

 

 

ట్రెండింగ్ వార్తలు