Parakramam : పరాక్రమం టీజర్ చూశారా? బోల్డ్ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ మళ్ళీ వచ్చేశాడు..

తాజాగా పరాక్రమం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించి టీజర్ రిలీజ్ చేశారు.

Parakramam : నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి బోల్డ్ సినిమాలతో పాపులర్ అయిన నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) ఇప్పుడు మరో సరికొత్త సినిమాతో రాబోతున్నాడు. గల్లీ క్రికెట్, లవ్ కాన్సెప్ట్ తో మరో బోల్డ్ సినిమాగా ‘పరాక్రమం’తో రాబోతున్నాడు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ పై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా ‘పరాక్రమం’. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా పరాక్రమం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించి టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కి విశ్వక్ సేన్, బుచ్చిబాబు, నిర్మాత SKN గెస్టులుగా వచ్చారు.

టీజర్ ఆద్యంతం ఆసక్తిగా జరిగింది. లోవరాజు పాత్రలో బండి సరోజ్ కుమార్ మరోసారి అదరగొట్టాడు. క్రికెట్ గొడవలు, నాటకాలు.. ఇలా ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. మీరు కూడా టీజర్ చూసేయండి..

ఇక ఈ కార్యక్రమంలో బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. 2004లో జూనియర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి వచ్చి ఆడిషన్స్ ఇస్తే నా యాక్టింగ్ ఎవ్వరికి అర్ధం కాలేదు. నా యాక్టింగ్ తెలిసిన డైరెక్టర్ నేనే అవ్వాలి అనుకోని డైరెక్టర్ గా కూడా మారాను. దర్శకుడిగా రెండు తమిళ చిత్రాలు, ఒక తెలుగు సినిమా చేశా. అవి డిజాస్టర్స్ అయ్యాయి. ఆ తర్వాత నేనే నటించి, నేనే డైరెక్ట్ చేసుకోవాలని నిర్భందం, నిర్భందం 2, మాంగళ్యం సినిమాలు చేశాను. కల నాది వెల మీది కాన్సెప్ట్ లో యూట్యూబ్ లో సినిమా చూసి నచ్చితే డబ్బులు పంపమన్నాను. చాలా మంది నాకు డబ్బులు పంపించారు. అది బాగా సక్సెస్ అయింది. నేను నటుడిగా, డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాకే థియేటర్స్ కి వద్దామనుకున్నా. అందుకే ఇప్పుడు పరాక్రమం సినిమాతో వస్తున్నా. నేను ఇండస్ట్రీలో ఎక్కువగా తిరగను. స్ట్రైట్ ఫార్వార్డ్ గా మాట్లాడతా కాబట్టి ఎక్కువమందికి నేను నచ్చను. నాకు ఇండస్ట్రీలో నచ్చిన ముగ్గురు వ్యక్తులు SKN, బుచ్చిబాబు గారు, విశ్వక్ సేన్. ఈ ముగ్గురూ ఇవాళ మా టీజర్ రిలీజ్ కార్యక్రమానికి గెస్టులుగా రావడం ఆనందంగా ఉంది. బుచ్చిబాబు గారు నా మాంగళ్యం సినిమా చూసి నేను 5 వేలు పంపించాను అని చెప్పారు. విశ్వక్ కూడా నాలాగే స్ట్రైట్ ఫార్వార్డ్ గా మాట్లాడతాడు. నా గత చిత్రాలు కొన్ని సెక్షన్స్ ఆడియెన్స్ కే పరిమితం అయ్యాయి కానీ ఈ సినిమా అందరూ చూడొచ్చు అని తెలిపారు.

Also Read : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూశారా? విశ్వక్ అదరగొట్టాడుగా..

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. నేను యానిమేషన్, ఎడిటింగ్ కోర్సులు నేర్చుకునేటప్పుడే బండి సరోజ్ కుమార్ పేరు విన్నా. ఆయన తమిళ్ లో పోర్కాళం అనే ఒక సినిమా చేశారు. ఆ సినిమా ఆడలేదు గానీ అది చాలా బాగుంటుంది. కరోనా టైమ్ లో బండి సరోజ్ కుమార్ నిర్భందం ట్రైలర్ చూసి ఆయనకు మెసేజ్ చేశాను. ఆయన ఒక స్ట్రాంగ్ వాయిస్ తన సినిమాల ద్వారా చెప్పాలనుకుంటున్నారు. ఆయనకు పరాక్రమం పెద్ద విజయాన్ని ఇవ్వాలి. ఆయన సినిమాకు టీమ్ అంటే ఆయనే. ఒక ఎనిమిది మంది పని సరోజ్ కుమార్ చేస్తుంటాడు. ఆల్ ది బెస్ట్ అన్నా అని అన్నారు.

నిర్మాత SKN మాట్లాడుతూ.. బండి సరోజ్ కుమార్ తో నాకు చిన్న పరిచయమే ఉంది. ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఏడెనిమిది క్రాఫ్టులు చేస్తున్నాడంటే అది ప్యాషన్, అవసరం, టాలెంట్. ఆయనకు ఈ సినిమా రిలీజ్, ప్రమోషన్ విషయంలో ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను చేస్తాను అని తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు