Bengal Politics: అదే కనుక జరగకుంటే బెంగాల్‭లో రక్తపాతం జరిగేదట.. పంచాయతీ ఎన్నికలపై బీజేపీ నేత ఘాటు వ్యాఖ్యలు

డైమండ్‌ హార్బర్‌, జాయ్‌నగర్‌, క్యానింగ్‌, కక్‌ద్వీప్‌, వర్ధమాన్‌లో బీజేపీ నేతలను ఇనుప రాడ్‌లతో నిర్దాక్షిణ్యంగా కొడుతున్నారు. బాంబులు పేలడం చూస్తూనే ఉన్నాం. ఇది రష్యా-ఉక్రెయిన్? మనం యుద్ధం చేస్తున్నామా? రాష్ట్రంలో అరాచక పాలనపై ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి

Panchayat Polls: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ నేత ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో జరిగే అల్లర్లను రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పోల్చుతూ కేంద్రం కనుక తన బలగాలను పంపకపోతే రక్తపాతం జరిగి ఉండేదని వ్యాఖ్యానించారు. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అగ్నిమిత్ర పాల్ బుధవారం డిమాండ్ చేశారు.

Pawan Kalyan: వైసీపీ నేతల దూషణలను ఆహ్వానిస్తున్నా.. నేను చేతలతో బదులిస్తా చూడు..: పవన్ వార్నింగ్

పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమైన రోజు నుంచి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఇవి వారు చేశారంటే వారే చేశారని ఇటు అధికర పక్షం అటు విపక్షం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ “నామినేషన్లు నమోదు చేసుకోవడానికి 5-6 రోజులు మాత్రమే సమయం ఉంది. మరే ఇతర రాజకీయ పార్టీతోనూ చర్చించలేదు. ఇతరులను సంప్రదించకుండా ఎవరి సలహా మేరకు పంచాయతీ ఎన్నికలను ప్రకటించారో మనందరికీ తెలుసు’’ అని అన్నారు.

Dehradun : కుళ్లిపోయిన అమ్మానాన్నల మృతదేహాల మధ్య సజీవంగా పసికందు..

‘‘డైమండ్‌ హార్బర్‌, జాయ్‌నగర్‌, క్యానింగ్‌, కక్‌ద్వీప్‌, వర్ధమాన్‌లో బీజేపీ నేతలను ఇనుప రాడ్‌లతో నిర్దాక్షిణ్యంగా కొడుతున్నారు. బాంబులు పేలడం చూస్తూనే ఉన్నాం. ఇది రష్యా-ఉక్రెయిన్? మనం యుద్ధం చేస్తున్నామా? రాష్ట్రంలో అరాచక పాలనపై ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి’’ అని అగ్నిమిత్ర పాల్ డిమాండ్‌ చేశారు.

NIMS: తెలంగాణ ఆరోగ్యంపై నిమ్స్ నయా సంతకం.. దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిగా నిమ్స్ రికార్డు

మరోవైపు ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌) సైతం అధికార టీఎంసీపై విమర్శలు చేసింది. ఆ పార్టీ నేత భాంగర్‌ ఎమ్మెల్యే నౌషాద్‌ సిద్ధిఖీ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలను నామినేషన్‌ దాఖలు చేసేందుకు అనుమతించడం లేదని ఆరోపించారు. మే 9 నుంచి రోజురోజుకు హింస పెరుగుతోందని అన్నారు. ఇవే కాకుండా పశ్చిమ బెంగాల్‌లో ఎక్కడికక్కడ నామినేషన్ల దాఖలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీకి నామినేషన్ దాఖలు చేసే హక్కు ఉంది, కానీ ఇక్కడ అభ్యర్థులను నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని సిద్ధిఖీ విమర్శలు గుప్పించారు.

Maharashtra Politics: శివసేనపై మెత్తబడ్డ బీజేపీ.. అన్నదమ్ముల ఫైట్ అంటూ కవరింగ్

పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు ఒకే దశలో జూలై 8న జరుగుతాయని, దీని కోసం జూలై 11న ఓట్ల లెక్కింపు జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు రెండు పార్టీలకు అగ్నిపరీక్షగా భావించే పంచాయితీ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు