India Covid Cases : భారత్‌లో కొత్తగా 3,37,704 పాజిటివ్ కేసులు, 488 మరణాలు

దేశంలో కరోనావైరస్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్‌లో రోజురోజుకీ కరోనా కేసుల ఉధృతి పెరిగిపోతోంది. మరణాలు సంఖ్య కూడా పెరిగిపోతోంది.

India Covid Cases : దేశంలో కరోనావైరస్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్‌లో రోజురోజుకీ కరోనా కేసుల ఉధృతి పెరిగిపోతోంది. మరణాలు సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 3,37, 704 నమోదు కాగా.. కరోనా మరణాల సంఖ్య 488గా నమోదైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21,13,365 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 5.43 శాతంగా ఉన్న కరోనా యాక్టివ్ కేసులు 17.22 శాతానికి చేరుకున్నాయి. రోజువారీ కరోనా పాజిటివిటి రేటు కూడా పెరిగింది.

దేశంలో ఇప్పటివరకు 3,89,03,731 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4,88,884 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో 93.31 శాతంగా కరోన రికవరీ రేటు నమోదైంది.. అలాగే శుక్రవారం ఒక్కరోజే కరోనా నుంచి 2,42,676 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,63,01,482 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10,050 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

మరోవైపు.. భారతదేశంలో 372 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 161.16 కోట్ల డోసుల టీకాలను కేంద్రం రాష్ట్రాలకు అందించింది. ఒక్క శుక్రవారమే 67,49,746 డోసుల టీకాలను అందించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 161,16,60,078 డోసుల టీకాలను అందించింది.

భారత్‌లో గత వారం రోజులుగా ఒమిక్రాన్ వల్ల కరోనా కేసులు వేగంగా పెరిగిపోవడం థర్డ్‌వేవ్ భయాందోళన నెలకొంది. 24 గంటల వ్యవధిలో భారత్‌లో మొత్తం 16,764 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 220 కరోనా మరణాలు సంభవించాయి. అక్టోబర్ తర్వాత ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్యలో ఇదే గరిష్టంగా చెప్పవచ్చు.

దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైతో పాటు కోల్‌కతాలో కరోనా కేసుల ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. శుక్రవారం ముంబైలో 3,671 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోల్చితే 46 శాతం అధికంగా నమోదయ్యాయి. ఢిల్లీలో 42 శాతం కరోనా కేసులు నమోదయ్యాయి. 1,313 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కోల్‌కతాలో గడిచిన 48 గంటల్లో కేసుల వృద్ధి 102 శాతం పెరిగి 1,090కి చేరుకుంది.

Read Also : Hyd Fever Survey : తెలంగాణలో ఫీవర్ సర్వే.. ఒక్కరోజులోనే 45,567 మందిలో లక్షణాలు గుర్తింపు

ట్రెండింగ్ వార్తలు