IND vs AUS Test 2023: తెలుగు కుర్రాడు భరత్‌కు రాహుల్ మద్దతు.. నాల్గో టెస్టులో చోటు పదిలమేనా..

నాల్గో టెస్టులో భరత్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చుఅనే వార్తల నేపథ్యంలో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. భరత్ ప్రదర్శనపై మేం ఎలాంటి ఆందోళన చెందడం లేదని అన్నారు.

IND vs AUS Test 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా జట్లమధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఇండియాలో జరుగుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు పూర్తికాగా.. 2-1 ఆధిక్యంలో టీమిండియా ఉంది. సిరీస్‌లో నిర్ణయాత్మక నాల్గో టెస్ట్ మ్యాచ్ గురువారం (మార్చి 9) నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ టీమిండియాకు కీలకం కానుంది. ఈ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు నేరుగా చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీనికితోడు సిరీస్ కైవసం చేసుకోచ్చు. దీంతో నాల్గో టెస్టులో విజయంపై టీమిండియా గురిపెట్టింది.

IND vs AUS 4th Test 2023: చివరి టెస్టులో టీమిండియాలో కీలక మార్పులు.. ఆ ఇద్దరు ప్లేయర్లు రీఎంట్రీ..!

నాల్గో టెస్టులో టీమిండియాలో తుదిజట్టులో పలు మార్పులు చోటుచేసుకుంటాయని సమాచారం. సిరాజుద్దీన్ స్థానంలో మహ్మద్ షమీ, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ స్థానంలో మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వస్తారని తెలుస్తోంది. మూడు టెస్టు మ్యాచ్‌లలో శ్రీకర్ భరత్ 8, 6, 23(నాటౌట్), 17, 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొని పరుగులు రావట్టడంలో భరత్ విఫలమవుతున్నాడు. దీంతో నాల్గో టెస్టులో అతన్ని పక్కకుపెట్టి ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకుంటారన్న చర్చ జరుగుతుంది. దీనికితోడు ఇషాన్ కిషన్ సాధన చేస్తుండగా కోచ్ రాహుల్ ద్రవిడ్ పక్కనే ఉండి సూచనలు చేస్తున్నట్లు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నాల్గో టెస్టు తుది జట్టులో ఇషాన్ ఖాయమని క్రీడాభిమానులు అంచనా వేస్తున్నారు.

IND vs AUS Test Series 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరాలంటే.. శ్రీలంక జట్టు ఓడాల్సిందేనా..

భరత్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చుననే వార్తల నేపథ్యంలో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. భరత్ ప్రదర్శనపై మేం ఎలాంటి ఆందోళన చెందడం లేదని అన్నారు. మూడో టెస్టులో భరత్ గొప్పగా రాణించనప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌లో అతడు చేసిన 17 పరుగులు మాత్రం చాలా కీలకం అని రాహుల్ చెప్పారు. భరత్ బ్యాటింగ్‌పై ఆందోళన లేదని, అతను మెరుగ్గా ఆడేలా మద్దతు ఇస్తామని రాహుల్ తెలిపారు. ఈనేపథ్యంలో భరత్ కు నాల్గో టెస్టు తుది జట్టులో అవకాశం దక్కుతుందా? లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే, భరత్ గత మూడు టెస్టుల్లో మైదానంలో పరుగులు రాబట్టలేక పోయినా.. కీపింగ్‌లో రాణిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు