Bismah Maroof : వెస్టిండీస్ పై ఘోర పరాజ‌యం.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సంచ‌ల‌న నిర్ణ‌యం..

సిరీస్ ముగిసిన రెండు రోజుల్లోపే పాకిస్తాన్ మహిళా జ‌ట్టు మాజీ కెప్టెన్ బిస్మా మ‌రూఫ్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

Bismah Maroof retirement : వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడు మ్యాచుల వ‌న్డేల సిరీస్‌ను 3-0 తేడాతో పాకిస్తాన్ కోల్పోయింది. ఈ సిరీస్ ముగిసిన రెండు రోజుల్లోపే పాకిస్తాన్ మహిళా జ‌ట్టు మాజీ కెప్టెన్ బిస్మా మ‌రూఫ్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించింది. 17 ఏళ్లుగా క్రికెట్ ఆడ‌టాన్ని ఆస్వాదించిన‌ట్లుగా చెప్పుకొచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కి స‌హ‌క‌రించిన అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ లేఖ‌ను విడుద‌ల చేసింది.

‘దేశానికి ప్రాతినిధ్యం వ‌హించాల‌నే నా క‌ల ఎప్పుడో నెర‌వేరింది. 17 ఏళ్ల నా ప్ర‌యాణం ఎన్నో స‌వాళ్లు, ఒడిదుడుగులు, విజ‌యాలు, మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల‌తో నిండిపోయింది. నా పై న‌మ్మ‌కం ఉంచి కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ధ‌న్య‌వాదాలు. నా ప్ర‌యాణం మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ద్ద‌తుగా ఉన్న వారితో పాటు అభిమానుల‌కు అంద‌రి కృత‌జ్ఞ‌త‌లు.’ అంటూ బిస్మా మ‌రూఫ్ రాసుకొచ్చింది.

T20 World Record : టీ20 క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం.. ఒక్కపరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు.. ఇలాంటి బౌల‌ర్‌కు మ‌న‌కు ఉంటేనా?

బిస్మా మ‌రూఫ్ 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. 136 వ‌న్డేలు, 146 టీ20ల్లో పాక్ కు ప్రాతినిధ్యం వ‌హించింది. వ‌న్డేల్లో 3369 ప‌రుగుల‌తో పాటు 44 వికెట్లు, 146 టీ20ల్లో 2893 ప‌రుగులతో పాటు 36 వికెట్లు తీసింది. కాగా.. పాకిస్తాన్ మ‌హిళా క్రికెట్‌లో వ‌న్డేలు, టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రీడాకారిగా కొన‌సాగుతోంది. 96 మ్యాచుల్లో పాకిస్తాన్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించింది.

Rishbh Pant : మ్యాచ్ అనంత‌రం క్ష‌మాప‌ణ చెప్పిన పంత్‌.. గొప్ప మ‌న‌సు అంటూ నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు

ట్రెండింగ్ వార్తలు