T20 World Record : టీ20 క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం.. ఒక్కపరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు.. ఇలాంటి బౌల‌ర్‌కు మ‌న‌కు ఉంటేనా?

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇండోనేషియా మహిళా క్రికెటర్ రోహ్మాలియా ప్రపంచ రికార్డు సృష్టించింది.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇండోనేషియా మహిళా క్రికెటర్ రోహ్మాలియా ప్రపంచ రికార్డు సృష్టించింది. మంగోలియాతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో చాలా చ‌క్క‌టి స్పెల్ వేసింది 17 ఏళ్ల రొహ్మాలియా. 20 బంతులు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 7 వికెట్లు ప‌డ‌గొట్టింది. దీంతో పురుషుల‌, మ‌హిళ‌ల అంత‌ర్జాతీయ టీ20ల్లో ఎలాంటి పరుగులు ఇవ్వకుండానే 7 వికెట్లు తీసిన మొద‌టి ప్లేయ‌ర్‌గా నిలిచింది.

పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యుత్త‌మ గ‌ణాంకాల రికార్డు స్యాజ్రుల్‌ ఇద్రుస్‌ (4-1-8-7) పేరిట ఉంది. మహిళల క్రికెట్‌ లో రొహ్మాలియాకు ముందు ఈ రికార్డు నెద‌ర్లాండ్స్ ప్లేయ‌ర్ ఫ్రెడ్రిక్‌ ఓవర్డిక్‌ (4-2-3-7) పేరిట ఉండేది. కాగా.. ప్రపంచ క్రికెట్‌ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ బౌలర్‌ పరుగులేమీ ఇవ్వకుండా 7 వికెట్లు తీసిన చ‌రిత్ర లేదు. ఈ ఘ‌న‌త సాధించిన తొలి ప్లేయ‌ర్ రోహ్మాలియానే.

MS Dhoni : అలర్ట్‌.. ‘రాంచీలో ఇరుక్కుపోయిన ధోని.. ఇంటికెళ్లేందుకు రూ.600 కావాల‌ట‌..’ ఈ మెసేజ్ మీకు వ‌చ్చిందా?

ఆమె అద్భుత ప్రదర్శనతో మంగోలియా జ‌ట్టు 24 పరుగులకే కుప్ప‌కూలింది. ఈ మ్యాచ్‌లో ఇండోనేషియా ఏకంగా 127 పరుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఒక్క బ్యాట‌ర్ కూడా రెండు అంకెల స్కోరు చేయ‌లేదు. ఆరుగురు బ్యాట‌ర్లు డ‌కౌట్ కాగా.. ఎక్స్‌ట్రాలే (10) టాప్ స్కోర్ కావ‌డం గ‌మ‌నార్హం.

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగులు చేసింది. నందా స‌కారిని (61) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగింది.

Guy Whittall : జింబాబ్వే మాజీ క్రికెట‌ర్ పై చిరుత దాడి.. ర‌క్షించిన పెంపుడు కుక్క‌..

ట్రెండింగ్ వార్తలు