Guy Whittall : జింబాబ్వే మాజీ క్రికెట‌ర్ పై చిరుత దాడి.. ర‌క్షించిన పెంపుడు కుక్క‌..

చిరుత దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డింది జింబాబ్వేకు చెందిన మాజీ క్రికెటర్‌ గై విట్టాల్ కావ‌డం గ‌మ‌నార్హం.

Guy Whittall : జింబాబ్వే మాజీ క్రికెట‌ర్ పై చిరుత దాడి.. ర‌క్షించిన పెంపుడు కుక్క‌..

Former Zimbabwe cricketer Guy Whittall mauled by leopard

కుక్క విశ్వాసం గ‌ల జంతువు అని ఎందుకు అంటారో ఈ ఘ‌ట‌న మ‌రోసారి రుజువు చేసింది. త‌న య‌జ‌మాని పై చిరుత దాడి చేయ‌గా త‌న ప్రాణాల‌కు తెగించి కుక్క అత‌డి ప్రాణాల‌ను కాపాడింది. ఈ ఘ‌ట‌న జింబాబ్వేలో చోటు చేసుకుంది. చిరుత దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డింది జింబాబ్వేకు చెందిన మాజీ క్రికెటర్‌ గై విట్టాల్ కావ‌డం గ‌మ‌నార్హం. అస‌లేం జ‌రిగింది అనే విష‌యాల‌ను అత‌డి భార్య హన్నా స్టూక్స్ సోష‌ల్ మీడియా వేదికగా వివ‌రించింది.

51 ఏళ్ల మాజీ ఆల్‌ రౌండర్ అయిన గై విట్టాల్ జింబాబ్వేలో స‌ఫారీ నిర్వ‌హిస్తున్నాడు. ఇటీవ‌ల అత‌డు హ్యూమ‌ని ప్రాంతంలో త‌న పెంపుడు కుక్క చికారాను తీసుకుని ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ఆ స‌మ‌యంలో హ‌ఠాత్తుగా అత‌డిపై చిరుత దాడి చేసింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన చికారా త‌న య‌జ‌మానిని ర‌క్షించేందుకు చాలా తీవ్రంగా ప్ర‌య‌త్నించింది.

T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ అంబాసిడ‌ర్‌గా జమైకా చిరుత‌ ఉసేన్ బోల్ట్..

ఈ క్ర‌మంలో చికారా కూడా తీవ్రంగా గాయ‌ప‌డింది. అయిన‌ప్ప‌టికీ త‌న పోరాటం ఆప‌లేదు. చివ‌ర‌కు చిరుత వెళ్లిపోయింది. తీవ్రంగా గాయ‌ప‌డిన గై విట్టాల్‌, చికారాను ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం చికారా కోలుకుంది. అదే స‌మ‌యంలో గై విట్టాల్‌కు శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. అత‌డి ప‌రిస్థితి ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

కాగా.. గాయాల‌తో ఉన్న విట్టాల్ ఫోటోల‌ను అత‌డి భార్య సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా.. 2013లో ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గై విట్టాల్ ఇంట్లో ఓ పెద్ద ముస‌లి చొర‌బ‌డింది. అది ఆయ‌న మంచం కింద‌కు వెళ్లింది. విష‌యాన్ని గ‌మ‌నించిన వారు రెస్క్యూ సిబ్బందికి స‌మాచారం ఇవ్వ‌డంతో వారి వ‌చ్చి దాన్ని ప‌ట్టుకోవ‌డంతో అత‌డికి ప్రాణాపాయం త‌ప్పింది.

Rishbh Pant : మ్యాచ్ అనంత‌రం క్ష‌మాప‌ణ చెప్పిన పంత్‌.. గొప్ప మ‌న‌సు అంటూ నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు