Rishbh Pant : మ్యాచ్ అనంత‌రం క్ష‌మాప‌ణ చెప్పిన పంత్‌.. గొప్ప మ‌న‌సు అంటూ నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టింది.

Rishabh Pant apologizes : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టింది. బుధ‌వారం గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో నాలుగు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఇక రీ ఎంట్రీలో ఆ జ‌ట్టు కెప్టెన్ రిష‌బ్ పంత్ అద‌ర‌గొడుతున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో పెను విధ్వంస‌మే సృష్టించాడు. కేవ‌లం 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స‌ర్లు బాది 88 ప‌రుగులతో అజేయంగా నిలిచాడు. కాగా.. మ్యాచ్ అనంత‌రం పంత్ ఓ కెమెరామెన్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఇందుకు సంబంధించి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఏం జ‌రిగిందంటే..?

నిన్న‌టి మ్యాచ్‌లో పంత్ కొట్టిన ఓ సిక్స‌ర్ బీసీసీఐ కెమెరామెన్ దేబ‌శిశ్ త‌గిలింది. దీంతో అత‌డికి గాయ‌మైంది. మ్యాచ్ అనంత‌రం ఈ విష‌యం తెలుసుకున్న పంత్ ఓ వీడియో సందేశాన్ని పంపాడు. ‘సారీ దేబ‌శిశ్ బాయ్‌.. మిమ్మ‌ల్ని కొట్టాల‌నే ఉద్దేశ్యం నాకు లేదు. బంతి పొర‌బాటున త‌గిలింది. తొంద‌ర‌గా మీరు కోలుకోవాల‌ని కోరుకుంటున్నా.’ అని ఆ వీడియోలో చెప్పాడు. దీన్ని ఐపీఎల్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

Anil Kumble : ‘అత‌డు మా బెంగ‌ళూరు అబ్బాయి.. ఎవ్వ‌రూ తాకొద్దు’ ఆరంభ సీజ‌న్ వేలంలో ఏం జ‌రిగిందో చెప్పిన కుంబ్లే

ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు పంత్ ది మంచి మ‌న‌సు అంటూ మెచ్చుకున్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రిష‌బ్ పంత్ (43 బంతుల్లో 88 నాటౌట్‌), అక్షర్‌ పటేల్‌ (43 బంతుల్లో 66) అర్ధ‌శ‌త‌కాలు బాద‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 224 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బౌల‌ర‌ల్లో సందీప్‌ వారియర్ మూడు వికెట్లు తీశాడు.

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 220 ప‌రుగులు చేసింది. సాయి సుదర్శన్ (39 బంతుల్లో 65), డేవిడ్ మిల్లర్ (23 బంతుల్లో 55) అర్ధ‌శత‌కాల‌తో రాణించినా 4 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఈ విజ‌యంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానానికి ఎగ‌బాకింది.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు.. సంజూశాంస‌న్‌, కేఎల్ రాహుల్‌ల‌కు జ‌ట్టులో చోటు ఇవ్వ‌ని ఇర్ఫాన్ ప‌ఠాన్‌

ట్రెండింగ్ వార్తలు