Anil Kumble : ‘అతడు మా బెంగళూరు అబ్బాయి.. ఎవ్వరూ తాకొద్దు’ ఆరంభ సీజన్ వేలంలో ఏం జరిగిందో చెప్పిన కుంబ్లే
టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజాలలో అనిల్ కుంబ్లే ఒకరు.

Kumble shares back story behind his trade to RCB in inaugural IPL season
Anil Kumble – RCB : టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజాలలో అనిల్ కుంబ్లే ఒకరు. టీమ్ఇండియా తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అతడి పేరిటే ఉంది. ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అతడిని వేలంలో సొంతం చేసుకుంది. నాటి వేలంలో ఆర్‌సీబీ యజమాని విజయ్ మాల్యా తనను ఎలా దక్కించుకున్నాడు అనే విషయాలను కుంబ్లే తాజాగా చెప్పుకొచ్చాడు.
2008 ఐపీఎల్ ఆరంభ సీజన్ కోసం వేలాన్ని నిర్వహించే ముందు కొందరు ఆటగాళ్లను ఐకాన్ ప్లేయర్ల జాబితాలో చేర్చారు. అయితే.. దిగ్గజ ఆటగాడు అయిన కుంబ్లేను కొన్ని కారణాల వల్ల ఆ జాబితాలో చేర్చలేదు. దీంతో అతడి పేరు వేలంలో నమోదు చేయబడింది. వేలంలో కుంబ్లే పేరు వచ్చిన సమయంలో విజయ్ మాల్యా లేచి నిలబడి అతడు బెంగళూరు అబ్బాయి. అతడి ఎవ్వరూ తీసుకోవద్దు అని గట్టిగా చెప్పడంతో ప్రాథమిక ధరకు అతడిని ఆర్సీబీ సొంతం చేసుకుంది.
David Warner : ఆధార్ కార్డు కోసం డేవిడ్ వార్నర్ పరుగులు..
‘ఆ సమయంలో నేను టెస్ట్‌లో భారత కెప్టెన్‌గా ఉన్నాను. కొన్ని కారణాల వల్ల నేను ఐకాన్ జాబితాలో భాగం కాలేకపోయాను. కాబట్టి నేను వేలంలో భాగమయ్యాను. నేను స్పష్టంగా ఇందులో పాల్గొనలేదు. కానీ నా పేరు వేలం పాటలో ఉంది, నా పేరు వచ్చిన వెంటనే విజయ్ మాల్యా లేచి నిలబడి అతను నా బెంగుళూరు అబ్బాయి అని చెప్పినట్లు నాకు గుర్తుంది. అతడిని ఎవరూ తీసుకోవద్దని చెప్పారట. అతడు బెంగళూరు తప్ప మరెక్కడికీ వెళ్లడం లేదని చెప్పాడట. బేస్ ధరకే నన్ను కొనుగోలు చేసినట్లుగా అనుకుంటున్నాను.’ అని కుంబ్లే తన యూట్యూబ్ ఛానెల్‌లో రవిచంద్రన్ అశ్విన్‌తో హృదయపూర్వక చాట్ సందర్భంగా చెప్పాడు .
ఆర్‌సీబీ తరుపున కుంబ్లే మూడేళ్లు ఆడాడు. 42 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించిన కుంబ్లే 23.51 సగటుతో 6.58 ఎకానమీతో 45 వికెట్లు తీశాడు.
MS Dhoni : ధోనికి కోపమొచ్చింది..! ‘నన్నెందుకు చూపిస్తున్నావు.. కొట్టేస్తా మిమ్మల్ని’
ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో ఆర్‌సీబీ దారుణ ప్రదర్శన చేసింది. 8 జట్లు పాల్గొన లీగ్‌లో ఏడో స్థానంలో నిలిచింది. ఆ మరుసటి సీజన్ అంటే 2009లో ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ మ్యాచులో డెక్కన్ ఛార్జర్స్ చేతిలో ఓడిపోయింది.