David Warner : ఆధార్ కార్డు కోసం డేవిడ్ వార్న‌ర్ ప‌రుగులు..

వార్న‌ర్‌కు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

David Warner : ఆధార్ కార్డు కోసం డేవిడ్ వార్న‌ర్ ప‌రుగులు..

David Warner runs to get his Aadhar Card made in fun video

Updated On : April 24, 2024 / 1:18 PM IST

David Warner – Aadhar Card : భార‌త‌దేశం అంటే ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్‌కు ఎంతో ఇష్టం అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక తెలుగు వాళ్ల‌తో వార్న‌ర్ బంధం విడ‌దీయ‌రానిది. ఐపీఎల్‌లో కొన్ని సీజ‌న్ల పాటు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్రాతినిధ్యం వ‌హించిన వార్న‌ర్ ఓ సారి జ‌ట్టుకు టైటిల్‌ను అందించాడు.

అంతేనా వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా తెలుగు సినిమా పాట‌లకు రీల్స్ చేస్తూ హీరోల డైలాగ్‌లు చెబుతూ డేవిడ్ భాయ్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. కాగా.. వార్న‌ర్‌కు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోలో వార్న‌ర్ ఉచిత ఆధార్ కార్డు తీసుకునేందుకు ప‌రిగెత్తుతున్నాడు.

MS Dhoni : ధోనికి కోప‌మొచ్చింది..! ‘నన్నెందుకు చూపిస్తున్నావు.. కొట్టేస్తా మిమ్మ‌ల్ని’

వీడియోలో ఏముందంటే..?

హోస్ట్‌తో వార్న‌ర్ హిందీలో మాట్లాడుతున్నాడు. హోస్ట్ సినిమాకి వెళ్దామా అని అడుగ‌గా వార్న‌ర్ రాలేన‌న్నాడు. ఫ్రీ భోజ‌నం చేద్దామా అని అడిగినా నో చెప్పాడు. ఉచిత ఆధార్ కార్డును ఇస్తున్నారు అని చెప్ప‌గానే ఛ‌లో ఛ‌లో అంటూ హోస్ట్‌ను ఎత్తుకుని మ‌రీ వార్న‌ర్ ప‌రుగులు పెట్టాడు. ఈ వీడియోను ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

ఐపీఎల్‌లో వార్న‌ర్ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అయితే.. గాయం కార‌ణంగా కొన్ని మ్యాచుల‌కు దూరం అయ్యాడు. నేడు ఢిల్లీ జ‌ట్టు గుజ‌రాత్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో వార్న‌ర్ అందుబాటులో ఉండేది లేనిది ఇంకా తెలియ‌రాలేదు. ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీ 8 మ్యాచులు ఆడింది. మూడు మ్యాచుల్లో విజ‌యం సాధించింది. ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ జ‌ట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతోంది.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు.. సంజూశాంస‌న్‌, కేఎల్ రాహుల్‌ల‌కు జ‌ట్టులో చోటు ఇవ్వ‌ని ఇర్ఫాన్ ప‌ఠాన్‌

 

View this post on Instagram

 

A post shared by Delhi Capitals (@delhicapitals)