Virat Kohli : ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే కోహ్లి ఒకే ఒక్క‌డు.. 10 సార్లు 400కి పైగా ప‌రుగులు..

ప‌రుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఖాతాలో మ‌రో రికార్డు వ‌చ్చి చేరింది.

VIRAT KOHLI BECOMES THE 1ST PLAYER IN IPL HISTORY TO SCORE 400 RUNS IN A SEASON 10 TIMES

Virat Kohli : ప‌రుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఖాతాలో మ‌రో రికార్డు వ‌చ్చి చేరింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు 400కి పైగా స్కోర్లను బాదిన ఏకైక ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ్యాచ్‌లో కోహ్లి ఈ రికార్డును అందుకున్నాడు. ఈ సీజ‌న్‌తో క‌లిపి కోహ్లి ఇప్పటి వ‌ర‌కు 10 సార్లు 400 పైగా ప‌రుగులు సాధించాడు. ఈ క్ర‌మంలో సురేశ్ రైనా రికార్డును బ్రేక్ చేశాడు. రైనా 9 సార్లు 400 పైగా ప‌రుగులు చేశాడు.

ఐపీఎల్ సీజ‌న్ల‌లో 400 పైగా ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్లు వీరే..
విరాట్ కోహ్లి – 10 సార్లు
సురేశ్ రైనా – 9 సార్లు
డేవిడ్ వార్న‌ర్ – 9 సార్లు

Navjot Singh Sidhu : ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వాలంటే.. ఈ విష‌యంలో అస్స‌లు రాజీ ప‌డొద్దు : నవజ్యోత్ సింగ్ సిద్ధూ

ఇక ఈ మ్యాచ్ కోహ్లి అద్భుతంగా ఆడాడు. 37 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత‌డికిది 53వ హాఫ్ సెంచ‌రీ. మొత్తంగా 43 బంతుల‌ను ఎదుర్కొన్న కోహ్లి 4 ఫోర్లు, 1 సిక్స్ బాది 51 ప‌రుగులు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు