India-China : సరిహద్దు ప్రతిష్ఠంభణ..14వ రౌండ్ చర్చలకు భారత్-చైనా సన్నద్ధం

వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్​-చైనా 14వ రౌండ్ చర్చలకు రెడీ అవుతున్నాయి. డిసెంబర్​ ద్వితీయార్థంలో ఇరు దేశాల మధ్య 14వ రౌండ్

India-China : వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్​-చైనా 14వ రౌండ్ చర్చలకు రెడీ అవుతున్నాయి. డిసెంబర్​ ద్వితీయార్థంలో ఇరు దేశాల మధ్య 14వ రౌండ్ కార్ప్స్​ కమాండ్​ స్థాయి చర్చలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

1971 యుద్ధంలో పాకిస్తాన్​పై విజయాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తోన్న గోల్డెన్​ జూబ్లీ ఉత్సవాల్లో డిసెంబర్​ 16 వరకు సైనిక బలగాలు నిమగ్నమై ఉంటాయని, ఆ తర్వాతే చర్చలకు సమయం నిర్ణయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కాగా, తూర్పు లడఖ్ లో గతేడాది మే నెల నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగి, వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు పక్షాలు భారీగా సైన్యాలను మోహరించిన విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఇప్పటికే 13 సార్లు సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిగాయి. పాంగాంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల దగ్గర బలగాల ఉపసంహరణ పూర్తయింది. హాట్​ స్ప్రింగ్స్​, గోగ్రా, దెమ్‌చోక్‌ల వద్ద బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

చివరగా ఇరు దేశాల మధ్య అక్టోబర్ 10,2021న 13వ విడత ఉన్నత స్థాయి సైనిక కమాండర్ల చర్చలు జరిగాయి.

ALSO READ Omicron Scare : ఇండియాలోకి ఒమిక్రాన్.. భయం వద్దు.. జాగ్రత్తలు మరువద్దు!

ట్రెండింగ్ వార్తలు