Yakshini Trailer : ‘యక్షిణి’ ట్రైలర్ రిలీజ్.. వామ్మో మంచు లక్ష్మి, వేదిక భయపెట్టడానికి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారుగా..

సోషియో ఫాంటసీ కథతో హారర్ ఎలిమెంట్స్ జతచేసి ఈ యక్షిణి సిరీస్ ని తెరకెక్కించారు.

Yakshini Trailer : బాహుబలి సినిమాని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాణంలో తెరకెక్కుతున్న సిరీస్ యక్షిణి. వేదిక, మంచు లక్ష్మి(Manchu Lakshmi), రాహుల్ విజయ్, అజయ్ ముఖ్య పాత్రల్లో ఈ సిరీస్ ని తెరకెక్కించారు. అర్జున ఫాల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్.. లాంటి సినిమాలతో దర్శకుడిగా మెప్పించిన తేజ మార్ని ఈ ‘యక్షిణి’ సిరీస్ ని డైరెక్ట్ చేసాడు. సోషియో ఫాంటసీ కథతో హారర్ ఎలిమెంట్స్ జతచేసి ఈ యక్షిణి సిరీస్ ని తెరకెక్కించారు.

తాజాగా ఈ యక్షిణి సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లో.. కుబేరుని రాజ్యం అలకాపురిలో ఉండే ఓ యక్షిణి(వేదిక) మనిషి ప్రేమ మాయలో పడి తన ధర్మాన్ని మరిచిపోవడంతో మనిషిగా మారి కొంతమందిని చంపిన తర్వాతే మళ్ళీ యక్షిణిగా మారతావు అనే శాపం ఉండటంతో పెళ్లి కోసం చూసే అబ్బాయి(రాహుల్ విజయ్) జీవితంలోకి యక్షిణి ఎలా వచ్చింది, మంచు లక్ష్మి, అజయ్ పాత్రలేంటి అంటూ ఆసక్తిగా చూపించారు. మీరు కూడా యక్షిణి సిరీస్ ట్రైలర్ చూసేయండి..

మైథలాజి అంశాలతో పాటు సోషియో ఫాంటసీతో యక్షిణి సిరీస్ భయపెడుతూ మెప్పిస్తుందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. ఇక ఈ సిరీస్ జూన్ 14 నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ.. భాషల్లో డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

ట్రెండింగ్ వార్తలు