Ashika Ranganath : మొన్న నాగార్జున.. ఇవాళ చిరంజీవి.. ఇంత అందాన్ని సీనియర్స్ పక్కన వాడేస్తున్నారేంటి?

సీనియర్ హీరోల పక్కన సూట్ అయ్యే యంగ్ హీరోయిన్స్ కి పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు.

Ashika Ranganath : సీనియర్ హీరోలకు ఇటీవల హీరోయిన్స్ దొరకడం కష్టమైపోయింది. సీనియర్ హీరోయిన్స్ నే మన హీరోల పక్కన వాడుతున్నా ఇంకా హీరోయిన్స్ కొరత ఉండటంతో ఇటీవల కొంతమంది కుర్ర హీరోయిన్స్ కూడా సీనియర్ హీరోల పక్కన చేసేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా సీనియర్ హీరోల పక్కన సూట్ అయ్యే యంగ్ హీరోయిన్స్ కి పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు.

ఇటీవల కన్నడ భామ ఆషికా రంగనాథ్ తెలుగులో నాగార్జున(Nagarjuna) సరసన ‘నా సామిరంగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టడమే కాక తన నటనతో మెప్పించి ఫ్యాన్స్ ని, ఫాలోవర్స్ ని సంపాదించింది. నా సామిరంగలో యువతిగా, మహిళగా నటించి అందర్నీ మెప్పించింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆషికా రంగనాథ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. కన్నడ భామ ఆషికా తెలుగు వాళ్ళు చూపిస్తున్న ప్రేమకు తెగ సంతోషపడింది. ఈ అమ్మాయికి తెలుగులో వరుస ఛాన్సులు వస్తాయని అంతా భావించారు.

Also Read : Raju Yadav : ‘రాజు యాదవ్’ మూవీ రివ్యూ.. గెటప్ శ్రీను హీరోగా హిట్ కొట్టాడా?

అనుకున్నట్టే ఆషికా రంగనాథ్ కు తెలుగులో ఏకంగా మెగాస్టార్ సరసన ఛాన్స్ వచ్చింది. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ జానర్ లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర(Vishwambhara) సినిమాలో ఇప్పటికే త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఆషికా రంగనాథ్ కూడా నటిస్తున్నట్టు నేడు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఆషికా రంగనాథ్ కి విశ్వంభర సినిమాలోకి వెల్కమ్ చెప్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు మూవీ యూనిట్. దీంతో ఇంత అందమైన అమ్మాయిని సీనియర్ హీరోల పక్కన ఎందుకు అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది ఏకంగా తెలుగులో రెండో సినిమాకే మెగాస్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక విశ్వంభర సినిమా ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఆషికా రంగనాథ్ కూడా నేటి నుంచి షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు