Jayaprada : అడవి రాముడు సినిమా షూట్‌లో ఏనుగుల మీద నుంచి పడిపోయాము..

అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్ లో ఇప్పటికే అయిదు ఎపిసోడ్ లు పూర్తికాగా తాజాగా ఆరో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఆరో ఎపిసోడ్ కి ముగ్గురు భామలని తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు ఇప్పటి హీరోయిన్ రాశిఖన్నాని తీసుకొచ్చారు. ఈ ముగ్గురితో కలిసి బాలయ్య.................

Jayaprada :  బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్‌ షో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్ లో ఇప్పటికే అయిదు ఎపిసోడ్ లు పూర్తికాగా తాజాగా ఆరో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఆరో ఎపిసోడ్ కి ముగ్గురు భామలని తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు ఇప్పటి హీరోయిన్ రాశిఖన్నాని తీసుకొచ్చారు. ఈ ముగ్గురితో కలిసి బాలయ్య ఎపిసోడ్ లో సందడి చేశారు.

జయసుధ, జయప్రదతో అప్పటి సినిమాల గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. జయసుధ మాట్లాడుతూ.. మేమిద్దరం చిన్నప్పటి నుండే ఫ్రెండ్స్. ఇద్దరం కలిసే ఎదిగాము కెరీర్ లో. ఇద్దరం కలిసి కూడా చాలా సినిమాల్లో నటించాము. అడవిరాముడు సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరం నటించాము. అప్పుడు షూటింగ్ అంతా 40 రోజులు ఒక అడవిలో జరిగింది. ఆ 40 రోజుల్లో మేము మరింత క్లోజ్ అయ్యాము అని తెలిపింది.

Unstoppable Episode 6 Promo : హీరోయిన్ అవ్వాలంటే కొన్ని కాంప్రమైజ్‌లు తప్పవు.. అన్‌స్టాపబుల్‌లో బాలయ్య..

జయప్రద మాట్లాడుతూ.. ఆ సినిమా నుంచి బాగా క్లోజ్ అయ్యాము. ఆ సినిమాలో ఒక సీన్ లో రెండు ఏనుగుల మీద మేమిద్దరం కూర్చుంటాము. ఫైటర్స్ వెనకాల నుంచి అరుస్తూ, బాంబులు పేలుస్తూ ఉండటంతో ఏనుగులు భయపడి పరిగెత్తి పైనున్న మా ఇద్దర్ని కింద పడేశాయి. ఆ తర్వాత కూడా చాలా ఆసినిమాలో ఇద్దరం కలిసి నటించాము. బాలీవుడ్ లో నా సినిమా షూటింగ్ ఆపుకొని మరీ జయని పెళ్లికూతురుని చేయడానికి వెళ్ళాను అని వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని తెలియచేశారు.

ట్రెండింగ్ వార్తలు