మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం : వెంకయ్య నాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు డి.శ్రీనివాస్ పార్దీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
- Harish Thanniru
- Published on- June 29, 2024 / 02:55 PM IST
Venkaiah Naidu : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారు జామున హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో శ్రీనివాస్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, శ్రీనివాస్ మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు డి.శ్రీనివాస్ పార్దీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు.
