INDW vs SAW : 90 ఏళ్ల మ‌హిళ‌ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో టీమ్ఇండియా స‌రికొత్త రికార్డు..

మ‌హిళ‌ల టెస్టు క్రికెట్‌లో భార‌త జ‌ట్టు స‌రికొత్త రికార్డును న‌మోదు చేసింది.

మ‌హిళ‌ల టెస్టు క్రికెట్‌లో భార‌త జ‌ట్టు స‌రికొత్త రికార్డును న‌మోదు చేసింది. మ‌హిళ‌ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్కోరు న‌మోదు చేసిన జ‌ట్టుగా టీమ్ఇండియా చ‌రిత్ర సృష్టించింది. చెన్నై వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఈ ఘ‌నత అందుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 6 వికెట్ల న‌ష్టానికి 603 ప‌రుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ క్ర‌మంలో 90 ఏళ్ల మ‌హిళ‌ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్కోరు చేసిన జ‌ట్టుగా నిలిచింది. అంత‌క‌ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ద‌క్షిణాఫ్రికా పై ఆసీస్ 575/9 (డిక్లేర్డ్) స్కోరు చేసింది.

ఓవ‌ర్ నైట్ స్కోరు 525/4 తో రెండో రోజు ఆట ప్రారంభించిన భార‌త్ మ‌రో 78 ప‌రుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆట‌లోనూ భార‌త బ్యాట‌ర్లు దూకుడు కొన‌సాగించారు. హ‌ర్మ‌న్ (69), రిచా ఘోష్ (86) ఐదో వికెట్‌కు 143 ప‌రుగులు జోడించారు. అనంత‌రం వీరిద్ద‌రు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఔట్ అయ్యారు. ఈ క్ర‌మంలో భార‌త్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో షెఫాలీ వ‌ర్మ (205; 197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) డ‌బుల్ సెంచ‌రీతో వీర‌విహహారం చేయ‌గా స్మృతి మంధాన (149; 161 బంతుల్లో 27 ఫోర్లు, 1 సిక్స్‌) శ‌త‌కంతో చెల‌రేగింది.

అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ద‌క్షిణాఫ్రికా రెండో రోజు టీ విరామానికి రెండు వికెట్లు కోల్పోయి 106 ప‌రుగులు చేసింది. మారిజానే కాప్ (3), సునే లూస్ (39) క్రీజులో ఉన్నారు. ద‌క్షిణాఫ్రికా ఇంకా భార‌త స్కోరు 497 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది.

IND vs SA : అయ్యో రామ‌చంద్ర‌.. ఈ అంఫైర్ ఉన్నాడంటే టీమ్ఇండియా ప‌ని గోవిందా..? ఇప్పుడెలా..?

మ‌హిళ‌ల టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక స్కోర్లు..

భారత్ 603/6 (డిక్లేర్) దక్షిణాఫ్రికాపై -2024
ఆస్ట్రేలియా 575/9 (డిక్లేర్) దక్షిణాఫ్రికాపై-2024
ఆస్ట్రేలియా 569/6 (డిక్లేర్) ఇంగ్లాండ్‌పై-1998
ఆస్ట్రేలియా 525 భారత్‌పై- 1984,
న్యూజిలాండ్ 517/8 ఇంగ్లాండ్ పై- 1996

ట్రెండింగ్ వార్తలు