IND vs SA Richard Kettleborough set to officiate as third umpire in final
India vs South Africa : టీ20 ప్రపంచకప్ 2024 ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. శనివారం బార్బడోస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ మ్యాచులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే.. ఐసీసీ చేసిన పనికి ప్రస్తుతం భారత అభిమానులు టెన్షన్‌లో మునిగిపోయారు. ఫైనల్ మ్యాచ్ కోసం అంపైర్‌ల జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఉండడమే ఇందుకు కారణం.
ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గాఫ్నీ, ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. థర్డ్ అంపైర్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో, ఫోర్త్ అంపైర్‌గా రోడ్ టక్కర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా సరే.. కెటిల్ బరో ఉండడంతో భారత అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
IND vs SA : ఫైనల్‌లో దక్షిణాఫ్రికా పై రోహిత్ శర్మ మరో 34 పరుగులు చేస్తే..
అభిమానుల నమ్మకం ప్రకారం భారత్ ఆడే నాకౌట్ మ్యాచుల్లో ఈ అంఫైర్ విధులు నిర్వర్తిస్తే ఆ మ్యాచ్‌లో భారత్ గెలవదు. గత నాలుగేళ్లల్లో చూసుకున్నా కూడా ఐసీసీ టోర్నీల్లో అతడు అంపైర్‌గా వ్యవహరించిన నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా ఓడిపోవడంతో అతడు అంటేనే భారత అభిమానులు భయపడుతున్నారు.
2014 నుంచి ఇదే రిపీట్ అవుతోంది. 2014 టీ20 ప్రపచకప్ ఫైనల్ మ్యాచులో రిచర్డే అంఫైర్. ఈ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయింది. 2015 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచులో ఆసీస్ చేతిలో టీమ్ఇండియా ఓడింది. 2016 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచులో వెస్టిండీస్ చేతిలో, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లోనూ భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచుల్లో రిచర్డ్ కెటిల్‌బరోనే అంఫైర్‌గా ఉండడం గమనార్హం.
ఇప్పుడు 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచుకు సైతం అతడు థర్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. దీంతో ఏం జరుగుతుందోనని భారత అభిమానులు కంగారు పడుతున్నారు.
గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. నేటి ఫైనల్ మ్యాచులో ఓడిపోతే.. రోహిత్ శర్మ సముద్రంలో దూకేస్తాడు..