Love Story : వినాయక చవితికి.. చైతు, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’..

వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 న ఈ బ్యూటిఫుల్ ‘లవ్ స్టోరీ’ థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు..

Love Story: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నబ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరి’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి.. ఏప్రిల్ 16న ‘లవ్ స్టోరి’ రిలీజ్‌ కావాల్సింది.

Folk Songs : ‘సారంగ దరియా’ నుండి ‘దిగు దిగు దిగు నాగ’ వరకు ఊపు ఊపుతున్న ఫోక్ సాంగ్స్..

కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. అక్కినేని అభిమానులు, మూవీ లవర్స్ ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని తేదీలు వైరల్ అయ్యాయి. అయితే బుధవారం కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ టీం. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 న ఈ బ్యూటిఫుల్ ‘లవ్ స్టోరీ’ థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్‌తో వదిలిన పోస్టర్లో చై, సాయి పల్లవిల పెయిర్ ఫ్రెష్ అండ్ క్యూట్‌గా అనిపిస్తోంది.

Saranga Dariya​​ : సోషల్ మీడియాలో ‘సారంగదరియా’ నయా రికార్డ్..!

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘ఏవో ఏవో కలలే’, ‘నీ చిత్రం చూసి’, ‘సారంగ దరియా’ పాటలు ఇప్పటికీ మారుమోగుతున్నాయి. లవ్, ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చెప్తున్నారు మేకర్స్..

ట్రెండింగ్ వార్తలు