Manmohan Singh : 90 ఏళ్ల వయస్సులో వీల్ చైర్‌లో రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్ ..

90 ఏళ్ల కురువద్ధుడు మన్మోహన్ సింగ్ రాజ్యసభకు వచ్చి ఓటు వేయటంపై ప్రతీపక్షాలు, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. అనారోగ్య పరిస్థితిలో కూడా మాజీ ప్రధానిని పార్లమెంట్ లో వీల్ చైర్ లో కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ కు మాత్రమే దక్కుతుంది అంటూ మండిపడింది బీజేపీ.

Manmohan Singh attended Rajya Sabha on wheelchair

Manmohan Singh on wheelchair : 90 ఏళ్ల వయస్సులో మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ 90 ఏళ్ల వయస్సులో రాజసభ (Rajya Sabha )కు వీల్ చైర్ లో వచ్చారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ చాలాకాలం తరువాత పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా గానీ 90 ఏళ్ల వయస్సులో కూడా ఆయన తన బాధ్యతలను నిర్వహించేందుకు రాజ్యసభకు వచ్చారు. మంగళవారం (ఆగస్టు 7) వీల్ చైర్ లో రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్ ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Bill)కు ఓటు వేశారు.

90 ఏళ్ల వయస్సులో అనారోగ్యాన్ని కూడా లెక్క చేయయండా తన బాధ్యతను విస్మరించని మన్మోహన్ సింగ్ నిబద్దతను ప్రతిపక్ష నేతలంతా ప్రశంసించారు. కానీ బీజేపీ మాత్రం ఇది అత్యంత సిగ్గుచేటు అని పేర్కొంది. మన్మోహన్ సింగ్ ఆ పరిస్థితుల్లో కూడా తన బాధ్యతను విస్మరించకుండా వచ్చి ఓటు వేసినందుకు..సభకు హాజరైనందుకు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

PM Kisan Tractor Scheme : రైతులు 50 శాతం సబ్సిడీతో ట్రాక్టర్ కొనుక్కోవచ్చు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? స్కీమ్ పూర్తి వివరాలు..

ఈ సందర్భంగా చద్దా మాట్లాడుతూ.. ఈరోజు రాజ్యసభలో మన్మోహన్ సింగ్ చిత్తశుద్ధికి మారుపేరుగా నిలిచారంటూ కొనియాడారు. మరి ముఖ్యంగా బ్లాక్ ఆర్డినెన్స్ కు వ్యతిరేకింగా ఓటు వేయడానికి వచ్చి.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటుకున్నారని కొనియాడారు. ఆయన అమూల్యమైన మద్ధతుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

వీల్ చైర్ లో మన్మోహన్ సింగ్ రాజ్యసభకు వచ్చి ఓటు వేయటంపై ప్రతీపక్షాలు, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పిచ్చిని దేశం గుర్తుంచుకుంటుందని ఎద్దేవా చేసింది. ఇలాంటి అనారోగ్య పరిస్థితిలో కూడా మాజీ ప్రధానిని పార్లమెంట్ లో వీల్ చైర్ లో కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ కు మాత్రమే దక్కుతుందని విమర్శించింది. నిజాయితీ లేని కాంగ్రెస్ కుటుంబాన్ని బతికించుకోవటానికి మన్మోహన్ సింగ్ ఇంత సాహసం చేయటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. మన్మోహన్ సింగ్ రాజ్యసభకు హాజరు కావడంపై బీజేపీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాట్ జవాబిస్తూ.. మన్మోహన్ సింగ్ కు ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసమే ఆయనను ఈ పరిస్థితుల్లో కూడా రాజ్యసభకు రప్పించిందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 101 ఓట్లు వచ్చాయి. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఆమ్ ఆద్మీ పార్టీకి, కేంద్రానికి మధ్య వివాదాస్పదంగా మారిన ఈ బిల్లు ఆగస్టు 3న లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు