Maharashtra Politics: అజిత్ పవార్‭కు పార్టీ పదవి వచ్చినట్టేనట.. క్లారిటీ ఇచ్చిన సుప్రియా సూలే

ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ విపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్.. తనను మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతల నుంచి తప్పించాలని బహిరంగంగా కోరారు. అంతటితో ఆగక, పార్టీలో తనకు ఎలాంటి పాత్రనైనా కేటాయించాలని బుధవారం పార్టీ నాయకత్వానికి అజిత్ పవార్ విజ్ఞప్తి చేశారు.

ajit pawar and supriya sule

NCP: తనకు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడి పదవి వద్దని, పార్టీలో ఏదైనా పదవి కావాలని అజిత్ పవార్ చేసిన డిమాండ్ నెరవేరినట్టే కనిపిస్తోంది. ఆయనకు తొందరలోనే పార్టీ పదవి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే చెప్పకనే చెప్పారు. ‘అజిత్ దాదా కోరుకున్నది నిజం కావాలని నేను కూడా ఆశిస్తున్నాను’’ అని సుప్రియా గురువారం అన్నారు. ఈమె మాటలు చూస్తుంటే తొందరలోనే అజిత్ పవార్‭కు పార్టీ అధినేత శరద్ పవార్ కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏ నిర్ణయమైనా పార్టీ ఉమ్మడిగా తీసుకుంటుందని సుప్రియా స్పష్టం చేశారు.

Digvijaya Singh : ప్రధాని మోదీ గొప్ప ఈవెంట్ మేనేజ‌ర్.. ఆయన గురించి ఇంకేం చెబుతాం : దిగ్విజయ్ సింగ్ సెటైర్లు

‘‘అజిత్ దాదా (అన్నయ్య) కోరుకున్నది జరగాలని నేను కూడా ఆశిస్తున్నాను. ఆయనకు ఏ పదవి ఇవ్వాలనేది పార్టీ కమిటీ నిర్ణయిస్తుంది. కానీ పార్టీలో ఆయన పని చేస్తానంటే అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. దాదా పార్టీలోకి వస్తే పార్టీ కార్యకర్తలకు కూడా కొత్త ఊపు వస్తుంది. అయితే ఆయన పార్టీకి రాష్ట్ర చీఫ్ బాధ్యతలు వస్తాయా లేదా అనేది పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఒక సోదరిగా నా సోదరుడి అనుకున్నవి నెరవేరాలని కోరుకుంటున్నాను’’ అని సుప్రియా సూలే అన్నారు.

CM KCR : మళ్లీ గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు, ఐటీ కంపెనీలు : సీఎం కేసీఆర్ వరాలు

ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ విపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్.. తనను మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతల నుంచి తప్పించాలని బహిరంగంగా కోరారు. అంతటితో ఆగక, పార్టీలో తనకు ఎలాంటి పాత్రనైనా కేటాయించాలని బుధవారం పార్టీ నాయకత్వానికి అజిత్ పవార్ విజ్ఞప్తి చేశారు. గురువారం ముంబైలో జరిగిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 24వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పవార్ ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. “ప్రతిపక్ష నాయకుడిగా కఠినంగా వ్యవహరించనని నాకు చెప్పారు. కానీ నాకు ఈ పదవిపై ఎప్పుడూ ఆసక్తి లేదు. కానీ పార్టీ ఎమ్మెల్యేల డిమాండ్ వల్ల ఆ పాత్రను అంగీకరించాల్సి వచ్చింది. పార్టీ సంస్థలో నాకు ఏదైనా పదవిని కేటాయించండి. నాకు అప్పగించిన ఏ బాధ్యతకైనా నేను పూర్తి న్యాయం చేస్తాను” అని అజిత్ పవార్ అన్నారు. అయితే తాను తాజాగా చేసిన డిమాండ్‌పై ఎన్సీపీ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.

Opposition Meet: విపక్షాల మీటింగుపై బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు

శివసేనలో తిరుగుబాటు కారణంగా మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిపోవడంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ గత జూలైలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక కొద్ది రోజుల క్రితం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన కుమార్తె, ఎంపీ అయిన సుప్రియా సూలేను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంతో పాటు మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. ఆమెతో పాటు ప్రఫుల్ పటేల్‭ను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. కానీ అజిత్ పవార్‭కు మాత్రం ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. ఇక కొద్ది రోజుల ముందు తానకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందంటూ అజిత్ పవార్ వ్యాఖ్యానించడం గుర్తుండే ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు