Netflix Audio Upgrade : నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త ఫీచర్.. ఏ డివైజ్‌లోనైనా సినిమా థియేటర్ వ్యూతో చూడొచ్చు!

ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇదో స్పేషియల్ ఆడియో ఫీచర్.

Netflix Audio Upgrade : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇదో స్పేషియల్ ఆడియో ఫీచర్.. 3D ఆడియో టెక్నాలజీ ద్వారా ఏదైనా మూవీ చూస్తుంటే.. అచ్చం థియేటర్లలో కూర్చొని చూసిన అనుభవం కలుగుతుంది. అంటే.. థియేటర్లలో మాదిరిగానే సౌండ్ వస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా 221 మిలియన్లకు పైగా వినియోగదారుల కోసం తన కేటలాగ్‌లో ఈ ఆడియో ఫీచర్ తీసుకొచ్చింది.

ఇందుకోసం జర్మన్ ఆడియో బ్రాండ్ సెన్‌హైజర్‌తో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్, స్పేషియల్ ఆడియో సౌండ్ (spatial audio sound) ఫీచర్‌తో ఆడియో సినిమాటిక్ అనుభవాన్ని పొందవచ్చు. అంతేకాదు.. ఏదైనా స్టీరియోకి కనెక్ట్ చేయడంలో కూడా సాయపడుతుంది. మీరు నెట్‌ఫ్లిక్స్ చూసేందుకు ఏ డివైజ్ ఉపయోగించినా సినిమాటిక్‌ వ్యూలో అనుభూతి చెందవచ్చు. అలాంటి అనుభవాన్ని తన వినియోగదారులకు అందించేందుకు నెట్‌ఫ్లిక్స్‌ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపింది.

Netflix Just Announced A Huge Audio Upgrade And You Can Try It Now

స్పేషియల్ ఆడియో అనేది 3D ఆడియో టెక్నాలజీగా పిలుస్తారు. ఇది ‘థియేటర్ లాంటి’ అనుభవాన్ని డైనమిక్ హెడ్-ట్రాకింగ్‌ని ఉపయోగించడం ద్వారా సినిమాలో లీనమయ్యే సౌండ్‌స్కేప్‌ను క్రియేట్ చేస్తుంది. స్పేషియల్ ఆడియో గురువారం నుంచి నెట్ ఫ్లిక్స్ కేటలాగ్‌లో రిలీజ్ చేసింది. సెర్చ్‌ ఆప్షన్‌లో స్పేషియల్ ఆడియోగా టైప్ చేయడం ద్వారా సెర్చ్‌లో సపోర్టు ఇచ్చే షో లేదా ఫిల్మ్‌ని ఎంచుకోవచ్చు. వ్యూ, సౌండ్ మిక్స్ కావడంతో చూసే వీక్షకులను థియేటర్లలో కూర్చొని చూస్తున్నామనే అనుభూతి కలుగుతుంది.

4K, HDR, Dolby Atmos, Netflix కాలిబ్రేటెడ్ మోడ్ సపోర్ట్ చేసే ఇతర ఫీచర్లకు ఈ సామర్థ్యాన్ని యాడ్ చేసినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం, స్పేషియల్ ఆడియోకు సపోర్టు చేసే కంటెంట్‌లో నాల్గవ సీజన్ స్ట్రేంజర్ థింగ్స్, ది ఆడమ్ ప్రాజెక్ట్, రెడ్ నోటీసు, ది విట్చర్, లాక్ అండ్‌ కీ ఉన్నాయి. డైనమిక్ హెడ్ ట్రాకింగ్‌తో కూడిన స్పేషియల్ ఆడియోను మీరు చూసే సినిమా లేదా వీడియో నుంచి థియేటర్ లాంటి సౌండ్ వినవచ్చు. ఆ సౌండ్ మీ చుట్టుపక్కల నుంచి వస్తున్నట్లు అనిపిస్తుంది.

Read Also : Netflix : దిగొచ్చిన నెట్‌ఫ్లిక్స్.. కొత్త కస్టమర్ల కోసం చౌకైన ప్లాన్లతో వస్తోంది..!

ట్రెండింగ్ వార్తలు