Uttar Pradesh : ఎంత నాణ్యతో..!? : ఓపెనింగ్‌ రోజు టెంకాయ కొడితే పగిలిన కొత్త రోడ్డు

కోటి రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన రోడ్డు ఓపెనింగ్‌ రోజునే దాని నాణ్యత ఎలా ఉందో బట్టబయలైంది. రోడ్డు ఓపెనింగ్‌లో భాగంగా కొబ్బరి కాయ కొట్టడానికి ప్రయత్నించగా అనూహ్య సంఘటన జరిగింది.

new road cracked on Opening day : కోటి రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన రోడ్డు ఓపెనింగ్‌ రోజునే దాని నాణ్యత ఎలా ఉందో బట్టబయలు అయ్యింది. రోడ్డు ఓపెనింగ్‌లో భాగంగా కొబ్బరి కాయ కొట్టడానికి ప్రయత్నించగా.. అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

కొబ్బరి కాయ బదులు రోడ్డు బీటలు వారింది. ఈ సంఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ బిజ్నోర్‌లో చోటు చేసుకుంది.

Strange Lights : ఆకాశంలో వింత కాంతులు

అయితే ఇలాంటి నాణ్యత లేని రోడ్లు ఒక్క యూపీలోనే కాదు దేశంలోని పలు ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంటాయి. పేరుకు మాత్రమే రోడ్డు వేస్తారు. లోపలంతా డొల్లే. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్ల కమీషన్ల కక్కుర్తితో నాసిరకం రోడ్లను వేసి చేతులు దులుపుకుంటారు. బిల్లులు మాత్రం లక్షల్లో చూపిస్తారు. సంగం డబ్బులను జేబులోకి మళ్లిస్తారు.

ఇక ఆ తర్వాత పాదచారులు, వాహనదారులు నాణ్యత లేని రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. అలాంటి రోడ్లపై ప్రయాణం చేయాలంటే నరకయాతనే. చిన్నపాటి వర్షాలకే రోడ్లు కొట్టుకుపోతాయి.

ట్రెండింగ్ వార్తలు