JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్.. అభ్యర్థులకు ముఖ్యమైన మార్గదర్శకాలివే..!

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే రిపోర్ట్ చేయాలి. అడ్మిట్ కార్డ్‌లో అవసరమైన వివరాలను చెక్ చేసుకోవాలి.

JEE Advanced 2024 : ప్రముఖ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) అడ్వాన్స్‌డ్ 2024ని నిర్వహిస్తుంది. మే 26, 2024న రెండు షిఫ్ట్‌లలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఐఐటీల్లో ప్రవేశం కల్పించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఐఐటీ మద్రాస్ ఆర్గనైజింగ్ ఇన్‌స్టిట్యూట్. పరీక్షలో రెండు ప్రశ్న పత్రాలు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 ఒక్కొక్కటి మూడు గంటల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు 2 పేపర్లకు హాజరు కావాలి. ప్రతి ప్రశ్నాపత్రం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనే 3 ప్రత్యేక సెక్షన్లను కలిగి ఉంటుంది. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు రిపోర్టు చేయాలి.

Read Also : CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

అడ్మిట్ కార్డ్‌లో అవసరమైన వివరాలను చెక్ చేసుకోవాలి. పరీక్షా కేంద్రాలు ఉదయం 7 గంటల నుంచి ఓపెన్ కానున్నాయి. డౌన్‌లోడ్ చేసిన అడ్మిట్ కార్డ్ ప్రింటెడ్ కాపీని వ్యాలిడిటీ అయ్యే ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డును తీసుకెళ్లాలి. తప్పనిసరిగా కింది డాక్యుమెంట్లలో ఏదైనా ఒకదాన్ని కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్, పాఠశాల/కాలేజ్/ఇన్‌స్టిట్యూట్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, పరీక్షకు ఫొటోతో కూడిన నోటరీ సర్టిఫికేట్ ఉండాలి. అభ్యర్థి గుర్తింపును పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్లతో పాటు ఐఐటీ ప్రతినిధులు ధృవీకరిస్తారు. అభ్యర్థి గుర్తింపుపై సందేహం ఉంటే.. పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

పరీక్షలో ఏదైనా మాస్ కాపీయింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2024 అన్ని అడ్మిషన్ సంబంధిత ప్రక్రియల నుంచి ఒకరి అభ్యర్థిత్వాన్ని అనర్హులుగా ప్రకటిస్తుంది. అలాంటి అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు అభ్యర్థులందరూ విస్తృతమైన, పరీక్షలకు లోబడి ఉంటారు. జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2024 పరీక్షా కేంద్రాల్లోని సిబ్బందికి, ఇతర అధికారులకు మహిళా అభ్యర్థులను పరీక్షించడంతోపాటు సమగ్రమైన సూచనలను జారీ చేస్తుంది. పరీక్ష హాల్‌లోకి పెన్నులు, పెన్సిళ్లు, పారదర్శకమైన బాటిల్‌లోని తాగునీరు, డౌన్‌లోడ్ చేసిన అడ్మిట్ కార్డ్, ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు మాత్రమే అనుమతి ఉంటుంది.

విద్యార్థులు పరీక్షా కేంద్రం లోపల కింది వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. గడియారాలు, మొబైల్ ఫోన్‌లు, బ్లూటూత్ డివైజ్, ఇయర్‌ఫోన్‌లు, మైక్రోఫోన్‌లు, పేజర్‌లు, హెల్త్ బ్యాండ్‌లు లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఏదైనా ప్రింటెడ్/చేతితో రాసిన కాగితం, లాగ్ టేబుల్‌లు, రైటింగ్ ప్యాడ్‌లు, స్కేల్స్, ఎరేజర్, జామెట్రీ/పెన్సిల్ బాక్స్‌లు, పర్సులు, కాలిక్యులేటర్లు, పెన్ డ్రైవ్‌లు, ఎలక్ట్రానిక్ పెన్నులు/స్కానర్, వ్యాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, కెమెరా, గాగుల్స్ లేదా వస్తువులకు అనుమతి ఉండదు.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

ట్రెండింగ్ వార్తలు