Naatu Naatu Song : మరికొద్ది గంటల్లో ఆస్కార్ వేడుక జరగబోతుంది. ప్రపంచ సినీ ప్రేమికులంతా ఈ అవార్డు వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం భారతదేశం నుంచి బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులకు ఈ ఆస్కార్ వేడుక మరింత ఆసక్తిగా మారింది. అయితే ఈ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు తో పాటు మరో నాలుగు పాటలు నిలిచాయి.
నాటు నాటు సాంగ్ RRR సినిమా నుంచి నామినేట్ అయింది. ఈ పాటని చంద్రబోస్ రాయగా, కీరవాణి సంగీతం అందించారు.
Tell it Like A Woman సినిమా నుంచి applause సాంగ్ నామినేషన్స్ లో నిలిచింది. ఈ పాటకు సంగీతం, రచయిత రెండూ డయానా వారెన్ అందించారు.
టామ్ క్రూయిజ్ నటించిన Top Gun : Maveric సినిమా నుంచి Hold my Hand సాంగ్ నామినేట్ అవ్వగా ఈ పాటని పాప్ సింగర్ లేడీ గాగా, బ్లడ్ పాప్ ఇద్దరూ కలిసి రచించి సంగీతం అందించారు.
Black Panther : Wakanda forecer సినిమా నుంచి Lift me up సాంగ్ నామినేట్ అవ్వగా ఈ పాటని టెమ్స్, ర్యాన్ కూగ్లర్ కలిసి రాశారు. ఈ పాటకు సంగీతం టెమ్స్, రిహన్న, ర్యాన్ కూగ్లర్, లుడ్విగ్ గోరాన్సన్ అందించారు.
Everything Everywher all at Once సినిమా నుంచి This is a Life సాంగ్ నామినేట్ లో నిలవగా ఈ పాటని ర్యాన్ లాట్, డేవిడ్ బైర్నే కలిసి రాయగా ర్యాన్ లాట్, డేవిడ్ బైర్నే, మిట్స్కి కలిసి సంగీతం అందించారు.
ఈ బెస్ట్ ఒరిజినల్ విభాగంలో అవార్డుని పాట రచయిత మరియు సంగీత దర్శకుడికి అందిస్తారు. ఇప్పటికే మన చంద్రబోస్, కీరవాణి అమెరికాలో సందడి చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఆస్కార్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టిస్తారని అంతా భావిస్తున్నారు.